మనదేశంలో ద్విచక్రవాహన దారులు హెల్మెట్స్ లేకుండా ఉండటం వల్ల రోజుకి 28 మంది మరణిస్తున్నారు. వారి కుటుంబాలలో అవి శోకాన్ని మిగులుస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత ఇటీవల రాఖీ పండగ సందర్భంగా తన సోదరుడు కేటీఆర్‌కి రాఖీ కడుతూ హెల్మెట్‌ని బహుమతిగా ఇచ్చింది. దీనికి గ్రీన్ చాలెంజ్‌లానే సిస్టర్స్ ఫర్ చేంజ్ అంటూ వినూత్న ప్రచారం మొదలుపెట్టింది.
దానిని సపోర్ట్ చేస్తూ మహేష్‌బాబు కూడా దీనిపై ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దీనికి కవిత మహేష్ పుట్టినరోజు సందర్భంగా తన విషెష్‌ని వినూత్నరీతిలో తెలిపింది. హ్యాపీ బర్త్‌డే మహేష్ గారు. మీకు శుభాకాంక్షలు. మంచి కార్యక్రమం అయిన సిస్టర్స్ ఫర్ చేంజ్‌కి మీరు మద్దతు ఇస్తూ, ప్రమోట్ చేస్తున్నారు. దీనికి మద్దతు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్. దీనిని కొంతమందైనా ఆలోచించి, హెల్మెట్‌లను గిప్ట్‌గా ఇచ్చి ప్రాణాలను కాపాడుకుంటారని ఆశిద్దామని తెలిపింది. దీనికి మహేష్ 'లైఫ్ సేఫ్ ఈజ్ ఏ ఫ్యామిలీ సేఫ్. సిస్టర్స్ ఫర్ చేంజ్' అంటూ తెలిపాడు.