Advertisementt

ప్రేమకు రెయిన్ చెక్ చెప్పబోతున్నారు..!

Sat 11th Aug 2018 09:49 AM
premaku rain check,release date,august 23  ప్రేమకు రెయిన్ చెక్ చెప్పబోతున్నారు..!
Premaku Rain Check Release Date Fixed ప్రేమకు రెయిన్ చెక్ చెప్పబోతున్నారు..!
Advertisement
Ads by CJ

ఆగస్ట్ 23న విడుదలకు సిద్దంగా ఉన్న యూత్ ఫుల్ లవ్ స్టొరీ 'ప్రేమకు రెయిన్ చెక్'

శరత్ మరార్ - నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ ప్రొడక్షన్ ‘ప్రేమకు రెయిన్ చెక్' చిత్రం ట్రైలర్ ఈ రోజు విడుదలయ్యింది. కొత్త తారాగణంతో నూతన దర్శకులు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ ‘ప్రేమకు రెయిన్ చెక్’ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్న సంగతి మనకు తెలిసిందే.

‘ప్రేమకు రెయిన్ చెక్’ టైటిల్ నుంచే కొత్తదనాన్ని ప్రేక్షకులకి అందించిన చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసిన ట్రైలర్ తో అంచనాలని పెంచేసింది. ప్రస్తుత యువత (మిల్లెనిఅల్స్) ని దృష్టిలో ఉంచుకొని ఈ కథ చెప్పే ప్రయత్నం చేశామని ఇంతకముందే దర్శకులు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ తెలిపారు. ట్రైలర్ చూస్తుంటే, కొత్తదనంతో పాటు ఛాయాగ్రహణం మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో మొదట ఆకర్షించే విషయం ఈ చిత్ర ఛాయాగ్రహణం, శరత్ గురువు గారు తన కెమెరాతో చూపించిన విజువల్స్ అధ్బుతంగా ఉన్నాయి. 

చిత్ర సంగీతం విడుదలైన మూడు పాటల రుచి చూసిన ప్రేక్షకులు, ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కచ్చితంగా ఆకర్షితులు అవుతారు. లవ్ స్టోరీస్ లో మెలోడీ ముఖ్యమైన అంశం, ‘ప్రాణమా’ పాట కొంచెం చూపించిన చిత్ర బృందం, ఈ పాట ఇంకా వినాలన్న ఉత్సాహాన్ని పెంచి, ప్రేక్షకులని ఊరించారు. ఈ పాట విడుదల కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. చిత్ర ఛాయాగ్రహణం, మ్యూజిక్ ఒక దానికి ఒకటి పోటి పడుతునట్టు కనపడుతుంది.  వీటితో పాటు ఈ ట్రైలర్ లో మనము గమనించాల్సిన కొత్త నటీనటులతో పాటు సుమన్, రఘు కారుమంచి, కిరీటి దామరాజు కూడా ముఖ్య పాత్రలు పోషించారు.

అభిలాష్, ప్రియల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో వెండి తెరపై చూడాలి. 

ఈ చిత్రంలో ఒక వ్యక్తి  తన ప్రేమకు రెయిన్ చెక్ ఇచ్చి కెరీర్ కి ప్రాముఖ్యత ఇచ్చి తన జీవితాన్ని ఎలా కాంప్లికేట్ చేశాడు అన్నది కథ అన్నది దర్శకులు తెలిపినప్పటికీ, ప్రేమ, అడ్వెంచర్ స్పోర్ట్స్, కార్పొరేట్ సెటప్  ట్రైలర్లో చూస్తే ఇంకా కథాంశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. మాటలు కూడా కొత్తగా నేటి యువతను ఆకర్షించేలా ఉన్నాయి.  ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ చిత్ర బృందం, ఈ చిత్రాన్ని ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు  తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు.

Premaku Rain Check Release Date Fixed :

Premaku Rain Check Release on August 23

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ