యాక్షన్ కింగ్ అర్జున్ 150వ సినిమా 'కురుక్షేత్రం' సెన్సార్ పూర్తి...త్వరలో విడుదల
యాక్షన్ హీరో అర్జున్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా నటించినా, క్యారెక్టర్ పోషించినా... ఆయన స్థానం ప్రత్యేకం. అందుకే అభిమానులు ఆయన సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. మరి అలాంటి యాక్షన్ హీరో అర్జున్ నటించిన 150వ సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు. యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150వ చిత్రం కురుక్షేత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాయికృష్ణ పెండ్యాల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ... మన యాక్షన్ కింగ్ అర్జున్ గారు రీసెంట్ గా నటించిన 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'అభిమన్యుడు' సినిమాలతో ఈ జెనరేషన్ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు. అలాంటి అర్జున్ అంటే తెలుగు ప్రేక్షకులకు అమితమైన ప్రేమ. చాలా మందికి కష్టసాధ్యమైన ఫీట్ ను అర్జున్ ఇప్పుడు సాధించారు. అదే 150వ చిత్రం. అర్జున్ గారు నటించిన 150వ చిత్రం కురుక్షేత్రం ను గ్రాండ్ లెవల్లో తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మంచి ప్రశంసలు అందుకున్నాం. సెన్సార్ రిపోర్ట్ ఫుల్ పాజిటివ్ గా రావడంతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఈసారి అర్జున్ గారు యాక్షన్ కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి మరోసారి ప్రేక్షకుల‌్ని మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే నాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసిన ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ థ్రిల్లర్స్ ని తలపించేలా ఉందనే కామెంట్స్ అందుకుంది. అర్జున్ ఇప్పటి వరకూ పోలీస్ పాత్రలు చాలా చేసినా ఒక భిన్నమైన పోలీస్ అధికారిగా ఇందులో కనిపించబోతున్నారు. మలయాళంలో మోహన్ లాల్ వంటి స్టార్స్ ని డైరెక్ట్ చేసిన అరుణ్ వైద్యనాథన్ కురుక్షేత్రంను ఆద్యంతం ఆసక్తిగా మలిచారు. ఊహించని మలుపులు, ఆసక్తికరమైన కథనాలతో ప్రేక్షకుల ఆలోచనలకు అందని థ్రిల్లర్ గా కురుక్షేత్రం అలరించబోతుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు ప్రసన్న, వరలక్ష్మి శరత్ కుమార్, సుమన్, సుహాసిని, వైభవ్, శ్రుతి హారి హారన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులుః శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్, సంగీతంః ఎస్. నవీన్, మాటలు- శశాంక్ వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీః అరవింద్ కృష్ణ, ఎడిటింగ్ః సతీష్ సూర్య, పిఆర్వో - ఏలూరు శ్రీను, స్క్రీన్ ప్లే - ఆనంద్ రాఘవ్ , అరుణ్ వైద్య నాథన్, కో ప్రొడ్యూసర్ - సాయి కృష్ణ పెండ్యాల. నిర్మాత - శ్రీనివాస్ మీసాల, కథ, దర్శకత్వం - అరుణ్ వైద్య నాథన్