తనకి సినిమా కథ నచ్చింది అంటే చాలు.. ఆ సినిమాని జాగ్రత్తగా నిర్మించి... పిచ్చెక్కించే ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హిట్ కొట్టే దిల్ రాజుకి ఈ మధ్యన ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైనట్లుగానే కనబడుతుంది. తన నుండి వచ్చే సినిమాలు సూపర్ హిట్ అనే లెవల్లో హీరోలను తక్కువ చేసి మట్లాడడం మొదలు పెట్టాడు. మొన్నామధ్యన లవర్ సినిమా విషయంలో రాజ్ తరుణ్ ని తక్కువ చేసిన దిల్ రాజు... తాజాగా నితిన్ నాకు ప్లాప్స్ ఉన్నాయి మీరు నా సినిమా చేసిపెట్టండి అని అడిగాడని అందరి ముందు చెప్పేసాడు. ఒకవేళ నితిన్ అడిగాడే అనుకోండి.. అది మనసులో పెట్టుకోవాలి. కానీ దిల్ రాజు అందరి ముందు చెప్పేసి నితిన్ కి హిట్ ఇవ్వడానికే అన్నట్టు సతీష్ వేగేశ్నతో కలిసి శ్రీనివాస కళ్యాణం సినిమా చేసినట్టుగా బిల్డప్ ఇచ్చాడు. సినిమా కథ మీద నమ్మకంతో.. తన బ్యానర్ లో శతమానం భవతి వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడితో ఈ శ్రీనివాస కళ్యాణం సినిమా చేశాడు. మరి సినిమా మీద భారీ అంచనాలే ఉండడంతో.. శ్రీనివాస కళ్యాణం ప్రమోషన్స్ ని కూడా ఎక్కడా తగ్గకుండా చాలా హై రేంజ్ లో చేశాడు దిల్ రాజు.
శ్రీనివాస కళ్యాణం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అన్న టైప్ లో దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రమోషన్స్ ని ఆకాశమే హద్దు అన్నట్టుగా.. ఈ మధ్యన నగరంలో డబ్బుని నీళ్లలా ఖర్చు పెడుతూ... చేస్తున్న రిచ్ పెళ్ళిళ్ళను ఎలా చేస్తున్నారో.. ఆ తరహాలో శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రమోషన్స్ చేపట్టాడు. మరి ప్రమోషన్స్ నే ఈ విధంగా చేసిన దిల్ రాజు.. సినిమా ఇంకే రేంజ్ లో చేశాడో అనే ఆసక్తి మాత్రం ప్రతి ప్రేక్షకుడిలో వచ్చేసింది. అందుకే శ్రీనివాస కళ్యాణం సినిమా విడుదలకు ముందు సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. శ్రీనివాస కళ్యాణం రిలీజైన థియేటర్ల ముందు పచ్చటి తోరణాలతో పందిళ్లు వేయడం విశేషం. అంతేకాదు.. మేళ తాళాలు సైతం ఏర్పాటు చేశారు. వాయిద్య కారులు వచ్చి కాసేపు సందడి చేసి వెళ్లారు. అందుకే ఈ సినిమా విజయం మీద దిల్ రాజు చాలా ధీమాగా కనిపించాడు. కానీ శ్రీనివాస కళ్యాణం సినిమాకి ప్రేక్షకుడు మిక్స్డ్ టాక్ ఇచ్చాడు. కుటుంబ కథా చిత్రమే అయినప్పటికీ.. మరీ పెళ్లి సిడి చూసినట్టుగా అనిపిస్తుందని అభిప్రాయాన్ని ప్రతి ప్రేక్షకుడు యునానమస్ గా చెబుతున్న మాట. ఒక పెళ్లి క్యాసెట్ ని చూస్తుంటే ఏ ఫీలింగ్ వస్తుందో... శ్రీనివాస కళ్యాణం సినిమా చూస్తుంటే ఆ ఫీలింగ్ వచ్చింది అంటున్నారంటే.. సినిమాకి హిట్ టాక్ వచ్చిందో.. యావరేజ్ టాక్ వచ్చిందో.. మొదట్లో అర్ధం కాకపోయినా... చివరికి సినిమాకి యావరేజ్ టాకే పడింది. సో దిల్ రాజు కి ఈ సినిమా మీద ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బేసిందనే చెప్పాలి.