Advertisementt

మహేష్‌ హీరోయిన్లకి అంత అవసరం లేదంట..!

Sat 11th Aug 2018 01:13 AM
sudheer babu,mahesh babu,birthday,wishes,heroines,movies  మహేష్‌ హీరోయిన్లకి అంత అవసరం లేదంట..!
Sudheer Babu About Mahesh Babu Movie Heroine మహేష్‌ హీరోయిన్లకి అంత అవసరం లేదంట..!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తాను ఏ చిత్రంలో నటించినా ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటాడని ఆయన చిత్రాలను చూస్తే అర్ధమవుతుంది. కొన్ని చిత్రాలు ఫ్లాప్‌ అయి ఉండవచ్చు గానీ ఆయా చిత్రాలలో కూడా మహేష్‌ ఏదో ఒక కొత్తదనం కోసం తాపత్రయపడటం మనకి తెలుస్తూనే ఉంటుంది. ఇక పుట్టినరోజు సందర్భంగా మహేష్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ ఆయన అభిమానులనే కాదు.. అందరు ప్రేక్షకులు, సినీ ప్రముఖులకు కూడా సూపర్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిందని చెప్పాలి. ఈ చిత్రానికి 'మహర్షి' అనే టైటిల్‌ని పెట్టి ఫస్ట్‌లుక్‌తోపాటు టీజర్‌ని కూడా విడుదల చేశారు. ఇందులో మహేష్‌ స్టూడెంట్‌లా స్టైల్‌గా నడుచుకుంటూ పక్కన అమ్మాయి కనపడగానే ఆమెను వెనక్కి తిరిగి చూసిన తీరుకు అందరు ఫిదా అవుతున్నారు. దీని గురించి హీరో, నటుడు మహేష్‌బాబు బావ సుధీర్‌బాబు స్పందించాడు. 

మహేష్‌ ప్రతి చిత్రంలో కొత్తదనం ఉండేలా చూసుకుంటాడని నాకు తెలుసు. ఇక ఆయన బర్త్‌డే నాడు ఇచ్చిన 'మహర్షి' సర్‌ప్రైజ్‌ మాత్రం నాకు చాలా స్పెషల్‌ అని చెప్పాలి. ఇందులో సూపర్‌స్టార్‌ లుక్‌ ఎంతో ఫ్రెస్‌గా, ఫెరోషియస్‌గా ఉంది. కానీ నేను సర్‌ప్రైజ్‌ కాని విషయం ఒకటుంది. మహేష్‌ పక్కనున్న అమ్మాయి నటించక్కర్లేదు. ఎందుకంటే మహేష్‌ని ఏ అమ్మాయి చూసినా వెంటనే అదే ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తుంది. ఎవరూ చూపించని విధంగా ఇందులో మహేష్‌బాబుని వంశీ పైడిపల్లి చూపించాడు. కంగ్రాట్స్‌ అండ్‌ ఆల్‌ది బెస్ట్‌ అని చెప్పాడు. 

ఇక ఈ చిత్రంలో మహేష్‌ 'రుషి' పాత్రలో నటిస్తుండగా, అల్లరినరేష్‌ రవి పాత్రను పోషిస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా, 2019 ఏప్రిల్‌ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Sudheer Babu About Mahesh Babu Movie Heroine:

Sudheer Babu Birthday Wishes to Super Star Mahesh Babu 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ