Advertisementt

అల్లుడు గారు 'అను బేబీ' సాంగేసుకున్నారు!

Fri 10th Aug 2018 07:45 PM
shailaja reddy alludu,anu baby song,maruthi,naga chaitanya,anu emmanuel  అల్లుడు గారు 'అను బేబీ' సాంగేసుకున్నారు!
Shailaja Reddy Alludu First video Single Launched అల్లుడు గారు 'అను బేబీ' సాంగేసుకున్నారు!
Advertisement
Ads by CJ

'శైలజారెడ్డి అల్లుడు' తొలి గీతం 'అను బేబీ' విడుదల 

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తుండగా ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాతలు నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ నిర్మిస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం నిర్మాణం పూర్తయింది. ఈ నెల 31 న చిత్రం విడుదల కానుంది.

ఈ చిత్ర తొలి గీతం 'అను బేబీ' ఈరోజు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ద్వారా విడుదలయింది. ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా, అనుదీప్ దేవ్ పాడారు. శేఖర్ వి.జె. నృత్య దర్శకత్వం వహించారు. ఆడియో విడుదల తేదీ, ఇతర వివరాలు త్వరలోనే తెలియపరుస్తామని చిత్ర దర్శక,నిర్మాతలు తెలిపారు.

దాసరి అరుణ్ కుమార్, గిరిబాబు, నరేష్, మురళీశర్మ, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వి, మధునందన్, శత్రు,కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్నారు.

సంగీతం: గోపి సుందర్, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, శ్రీమణి, కాసర్ల శ్యామ్, కృష్ణ కాంత్, కెమెరా: నిజార్ షఫీ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఫైట్స్: వెంకట్ - దిలీప్ సుబ్బరామన్, నిర్మాతలు: నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ (చినబాబు), రచన-దర్శకత్వం: మారుతి 

Shailaja Reddy Alludu First video Single Launched:

Shailaja Reddy Alludu movie Anu BaBy Video Single Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ