మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్ వస్తున్న మహేష్ 25వ సినిమా అంచనాలు తగ్గట్టుగానే తన మొదటి లుక్ తో ఆకట్టుకున్నాడు మహేష్. ఈ సినిమాకు 'మహర్షి' అనే టైటిల్ పెట్టారు. ఇందులో మహేష్ పాత్ర పేరు రిషి. మహేష్ ఇందులో స్టూడెంట్ గా కనిపించబోతున్నాడని.. ఇప్పుడు నుండే ఆ సినిమాను ఎప్పుడు ఎప్పుడు చూద్దాం అని తన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నాడనేది తెలిసిన విషయమే. ఇందులో అతని పాత్ర చాలా కీలకం అని తెలుస్తుంది. గతంలో 'గమ్యం'..'శంభో శివ శంభో' సినిమాల్లో అల్లరి నరేష్ తన నటనతో ఎంతగా ఆకట్టుకున్నాడో తెలిసిన విషయమే. ఆ పాత్రలకి ఆడియెన్స్ నుంచి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఇప్పుడు అటువంటి పాత్ర ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. మహేష్ కి స్నేహితుడిగా నరేష్ నటించనున్నట్లు అనేక రూమర్స్ వస్తున్నాయి.
అయితే మహేష్ పుట్టినరోజు సందర్భంగా అల్లరి నరేష్ విషెస్ చెబుతూ ట్వీట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో రవి (అల్లరి నరేష్) టూ రిషి అని మహేష్ కు విషెస్ చెప్పాడు నరేష్. ఈ మూవీలో రిషి (మహేష్) తన స్నేహితుడు కోసం అమెరికా నుండి ఇండియా వస్తాడని గత కొన్ని రోజులు నుండి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సో ఈరోజు అల్లరి నరేష్ ట్వీట్ తో ఫ్యాన్స్ ఆ రూమర్ నిజమే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో వీళ్ల ఫ్రెండ్ షిప్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.