క్రికెట్ క్రీడాకారులు, ఇతర ఆటగాళ్లు, సినిమా రంగంలోని వారు తమ భర్తలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమైపోతుంటారు. పనిలో పనిగా ఆయా ప్రదేశాలలో భార్యాభర్తలు, ప్రేయసి ప్రియుళ్లు షూటింగ్ గ్యాప్‌లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక గడుసుపిల్ల సమంత గురించి వేరే చెప్పాలా? ఆమె తాజాగా గోవాలో ప్రత్యక్షమైంది. రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండమన్న సూక్తి ప్రకారం సమంత గోవాలో ఎలా ఉండాలో అలానే కనిపించి తన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. చాలా మందిని పెళ్లయినా కూడా ఇలాంటి బీచ్ దుస్తుల్లో ఎలా కనిపిస్తారు? అని అడిగితే వారిచ్చే సమాధానం బీచ్‌లో బికినీ కాకుండా చీర కట్టుకుంటామా? అని ప్రశ్నిస్తారు.
అదే విధంగా సమంత కూడా వైట్ టాప్, బ్లాక్ షార్ట్‌లో కనిపిస్తూ ఉంది. చిరునవ్వులు చిందిస్తోన్న ఈ అల్లరిపిల్ల కాస్ట్యూమ్స్‌ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ ఫొటోలను పోస్ట్ చేసిన గంటలోనే ఈ పిక్‌కి రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటే ఆమె ఎలా నెటిజన్లను ఆకర్షిస్తోందో అర్ధం అవుతోంది. మరోవైపు ఆమె భర్త నాగచైతన్య ప్రస్తుతం గోవాలోనే 'శైలజారెడ్డి అల్లుడు'కి సంబంధించి అను ఇమ్మాన్యుయేల్‌తో కలిసి డ్యూయెట్ పాడుకుంటున్నాడు.
షూటింగ్‌లో అను ఇమ్మాన్యుయేల్‌తో షూటింగ్ గ్యాప్‌లో సమంతతో మన అక్కినేని బుల్లోడు బాగానే ఎంజాయ్ చేస్తున్నాడన్నమాట. ఇక ఈ పాటతో 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం పూర్తవుతుంది. ఈనెల 31న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సమంత 'యూటర్న్' షూటింగ్‌లో బిజీగా ఉంది.