మెగాస్టార్ చిరంజీవి ఎదుటి వారిని భలే అంచనా వేస్తారు. పేర్లతో సహా అందరిని గుర్తుపెట్టుకునే ఆయన ఎదుటి వారి మనస్తత్వాన్ని చాలా స్పీడ్ గా స్టడీ చేస్తాడు. ఇక పవన్‌ది మరో టైపు. ఆయనకు సిగ్గు ఎక్కువ. అయితే బాగా కనెక్ట్ అవ్వడానికి ఎంతో సమయం తీసుకుంటాడు. ఆయన కూడా బాగా లోతుగా విశ్లేషించుకుని స్నేహం చేస్తాడు.
ఇక రామ్‌చరణ్ విషయం ఏమిటో తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ యాక్టర్‌గా మంచి ఒడ్డు పొడవు, అందమైన మొహం కలిగిన సమీర్ చెప్పుకొచ్చాడు. రామ్‌చరణ్ గారు చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు. చాలా హార్డ్ వర్కర్. అందరితో కలుస్తాడు. భోజనం చేస్తాడు.. ఇలా అన్ని చేసినా కూడా ఆయనతో కనెక్ట్ కావడం చాలా కష్టమైన పని. కనెక్ట్ అయితే మాత్రం ఇక అసలు వదలడు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వారు అనే విషయంపై ముందుగా చరణ్ స్టడీ చేస్తాడు.
చిరంజీవి, బాబాయ్ పవన్‌కళ్యాణ్‌ల నుంచి ఆయనకు వచ్చిన క్వాలిటీ ఇది. చరణ్‌తోనేనైతే ఈజీగా కనెక్ట్ అయ్యాను. చరణ్‌తో కలిసి 'మగధీర, గోవిందుడు అందరి వాడేలే' వంటి చిత్రాలలో నటించాను... అని చెబుతూ మెగా హీరోల మనస్తత్వాలను కరెక్ట్‌గా చెప్పుకొచ్చాడు. మరి ఆమాత్రం స్టడీ చేయకపోతే ఎవరినంటే వారిని నమ్మి ఎంతో మోసపోయిన హీరోలుగా మిగులుతారు. కాబట్టి ఈ ముందు జాగ్రత్త ప్రతి మనిషికి మరీ ముఖ్యంగా సినీ రంగం వారికి ఖచ్చితంగా ఉండాల్సిందే..!