Advertisementt

స్టాలిన్ తర్వాత మళ్లీ చిరుతో ఈ భామ!

Fri 10th Aug 2018 10:40 AM
chiranjeevi,koratala siva,heroine,anushka,chiranjeevi 152 movie  స్టాలిన్ తర్వాత మళ్లీ చిరుతో ఈ భామ!
Anushka in Chiranjeevi and Koratala Film స్టాలిన్ తర్వాత మళ్లీ చిరుతో ఈ భామ!
Advertisement
Ads by CJ

స్వీటీ అనుష్క సీనియర్‌ స్టార్స్‌, యంగ్‌స్టార్స్‌ సరసన కూడా నటించి తన సత్తా చాటింది. ఇక ఈమె తెలుగులోనే కాదు తమిళంలో కూడా దాదాపు అందరు స్టార్స్‌ సరసన నటించింది. మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల ద్వారా కూడా తన సత్తా చాటింది. ఇక ఈమె మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన 'స్టాలిన్‌' చిత్రంలో చిరుతో ఓ పాటలో ఆడిపాడింది. మరలా ఆమె ఇంత కాలం తర్వాత మరోసారి చిరుకి పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి 'సై..రా...నరసింహారెడ్డి' చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఇందులో కోలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార చిరు పక్కన నటిస్తోంది. ఈ 151వ చిత్రం షూటింగ్‌ కొంత వరకు పూర్తయింది. షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి తన 152వ చిత్రాన్ని కొరటాలశివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఇచ్చే కొరటాల శివ ఇందులో చిరంజీవి కోసం రైతు పాత్రను ఎంచుకున్నాడట. 

రైతుల సమస్యల చుట్టూ తిరగనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష, తమన్నాతో పాటు పలువురు బాలీవుడ్‌ హీరోయిన్లను కూడా పరిశీలించి చివరకు నటనపరంగా, క్రేజ్‌ పరంగా కూడా ఎంతో సత్తా ఉన్న స్వీటీ అనుష్కను ఇందులో హీరోయిన్‌ పాత్రకి ఎంపిక చేశారని సమాచారం. ఈ చిత్రం షూటింగ్‌ను 'సై..రా..నరసింహారెడ్డి'లో చిరంజీవి పార్ట్‌ షూటింగ్‌ ప్రారంభమైన వెంటనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Anushka in Chiranjeevi and Koratala Film:

Chiranjeevi and Koratala Film Heroine Confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ