విజయ్ దేవరకొండ నుండి 'అర్జున్ రెడ్డి' వచ్చి దాదాపు ఏడాది కావొస్తుంది. ఇప్పటి వరకు ఆయన నుండి ఒక్క సరైన సినిమా రాలేదు. ఈ మధ్యలో ‘ఏం మంత్రం వేసావె’ అంటూ ఒక సినిమాతో వచ్చిన అది వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికి తెలియలేదు. ఇక ఈ నెల 15న విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా ‘గీత గోవిందం’ అనే సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాపైనే అందరి ద్రుష్టి ఉంది.
ఇందులో విజయ్ పాత్ర ఎలా ఉంటది..అతను ఎలా పెర్ఫామ్ చేశాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అతని ఫ్యాన్స్. అయితే 'అర్జున్ రెడ్డి' తో పోలిస్తే ఈ సినిమాలో అతడి పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నాడు దర్శకుడు పరశురామ్. ఈ చిత్రంలో విజయ్ పాత్ర ఎలా ఉంటుందో రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ వెల్లడించాడు.
ఇందులో విజయ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాడట. కానీ అతని గోల్ అది కాదట. అతను జూనియర్ సైంటిస్ట్ పాత్ర కోసం అప్లై చేసి ఉంటాడట. ఆ లోపు అతను ఒక కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తాడంట. ఇక హీరోయిన్ రష్మిక ఐటీ ఎంప్లాయ్ పాత్రలో నటించిందట. ఇందులో విజయ్ పాత్ర డౌన్ టు ఎర్త్ గా ఉంటుందని..ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న మంచి వ్యక్తిగా అతను కనిపించనున్నాడని డైరెక్టర్ పరశురామ్ చెప్పారు. ఇక ఈ సినిమాలో విలన్స్ ఎవరు లేరని.. హీరోహీరోయిన్స్ మధ్య నడిచే స్టోరీ అని ఆయన చెప్పారు.