Advertisementt

'మహర్షి' టీజర్: 25 ఏళ్ళ కుర్రాడిలా ఉన్నాడు

Thu 09th Aug 2018 08:29 PM
mahesh babu,maharshi teaser,super star mahesh babu,birthday special,young  'మహర్షి' టీజర్: 25 ఏళ్ళ కుర్రాడిలా ఉన్నాడు
Mahesh Babu's Maharshi Teaser Released 'మహర్షి' టీజర్: 25 ఏళ్ళ కుర్రాడిలా ఉన్నాడు
Advertisement
Ads by CJ

మహేష్ బాబు 'భరత్ అనే నేను' బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఎలాంటి సబ్జెట్ తీసుకుని.. ఎలాంటి లుక్ లో కనిపిస్తాడో.. మా అభిమాన హీరోని ఎలా చూస్తామో అనే అభిమానుల ఎదురు చూపులకు.. హాయి కలిగించేలా.. మహేష్ తన పుట్టిన రోజు కానుకగా... మహేష్ 25 మూవీ ఫస్ట్ లుక్ తో వచ్చాడు. ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. మహేష్ 25 మూవీ టైటిల్ అండ్ టీజర్ అంటే మహేష్ అభిమానులకు టోటల్ గా త్రిబుల్ ధమాకా ఇచ్చేశాడు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమాకి ముగ్గురు నిర్మాతలు. దిల్ రాజు, పివిపి, అశ్వినిదత్ లు నిర్మాతలుగా మహేష్ 25 వ మూవీ జూలై నెలలో పట్టాలెక్కింది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ.. సినిమా షూటింగ్ మొదలైంది మొదలు అస్సలు విరామమే లేకుండా వంశీ ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నాడు. అందుకే మహేష్ బాబు పుట్టిన రోజు నాటికే సినిమాలోని మహేష్ లుక్ తో పాటుగా సినిమా టైటిల్ అండ్ టీజర్ ని ఇచ్చేసి మహేష్ అభిమానుల దిల్ ఖుషి చేశాడు వంశీ.

ఇక మహేష్ 25 మూవీ టైటిల్ ని అందరిలో ఆసక్తిని పెంచుతూ రోజుకో లెటర్ ని సోషల్ మీడియాలో వదులుతూ మహేష్ 25 మూవీ టైటిల్ మీద ఫజిల్ గేమ్ పెట్టారు. అయితే వారు వదిలిన 'R, I, S, H, I' అక్షరాలతో అందరూ మహేష్ 25 మూవీ టైటిల్ రిషి గా ఫిక్స్ అయ్యారు. వంశీ వదిలిన లెటర్స్ అందరూ మహేష్ మూవీ టైటిల్ అనుకుంటుంటే.. రిషి అనేది మహేష్ పాత్ర పేరని.. మహేష్ మూవీ టైటిల్ 'మహర్షి' అని తాజాగా రివీల్ చేశారు. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ తో పాటుగా మహేష్ బాబు కాలర్ ఎగరేస్తూ నడిచొస్తున్న స్టూడెంట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. అంతేనా మళ్ళీ ఈ రోజు అంటే గురువారం 9.45 కి 'మహర్షి' అదేనండి మహేష్ 'మహర్షి' సినిమా టీజర్ ని వదిలారు. మరి టీజర్ లో మహేష్ బాబు స్టూడెంట్ లుక్ లో కాలేజ్ లో కూల్ గా అమ్మాయిలను అలా అలా చూస్తూ నవ్వుతూ నడిచొస్తుంటే.. రిషి ని పరిచయం చేశామంటూ టీజర్  ని ఎండ్ చేశారు. మరి మహేష్ బాబు చిన్నగా పెరిగిన గెడ్డం లుక్ లో అచ్చం 25 ఏళ్ళ కుర్రాడిలా నిజంగా స్టూడెంట్ అనిపించేలా ఉన్నాడు. 

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మహేష్ ఒక్క మహర్షి లుక్ తోనే అందరిని ఇంప్రెస్ చేశాడు. మహర్షి సినిమా టైటిల్ తోనే సగం హిట్ కొట్టాడని మహేష్ అభిమానులు సంబరపడిపోతున్నారు.

Click Here for Teaser

Mahesh Babu's Maharshi Teaser Released:

Tremoundes Response to Maharshi Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ