Advertisementt

మహేష్.. 'మహర్షి'గా వచ్చేశాడు..!

Thu 09th Aug 2018 06:55 PM
mahesh babu,25th film title,maharshi,super star,birthday special  మహేష్.. 'మహర్షి'గా వచ్చేశాడు..!
Mahesh Babu Maharshi First Look మహేష్.. 'మహర్షి'గా వచ్చేశాడు..!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌ 25వ చిత్రం పేరు 'మహర్షి'

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పివిపి సినిమా నిర్మిస్తున్న ప్రెస్టీజియస్‌ మూవీకి 'మహర్షి'గా పేరు పెట్టారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ 25వ చిత్రంగా రూపొందుతున్న 'మహర్షి' చిత్రం ఫస్ట్‌లుక్‌ని మహేష్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌కి వరల్డ్‌వైడ్‌గా ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. 'మహర్షి'లో రిషిగా ఓ డిఫరెంట్‌ రోల్‌లో, కొత్త లుక్‌లో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించనున్నారు సూపర్‌స్టార్‌ మహేష్‌. 

డెహ్రాడూన్‌, హైదరాబాద్‌, గోవాలలో షెడ్యూల్స్‌ జరుపుకున్న ఈ భారీ చిత్రం నిర్మాణం ఏకథాటిగా జరుగుతోంది. 2019 ఏప్రిల్‌ 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కామెడీ కింగ్‌, హీరో అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగణం నటిస్తోన్న ఈ 'మహర్షి' చిత్రం హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ అద్భుతమైన సంగీతాన్ని ఇస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.యు. మోహనన్‌ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. హరి, సాల్మన్‌, సునీల్‌ బాబు, కె.ఎల్‌. ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ ఇతర సాంకేతిక వర్గం. 

Mahesh Babu Maharshi First Look:

Mahesh Babu 25th Film Title Maharshi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ