నటీనటులకే మెగా ఫోన్ చేతపట్టాలనే ఉబలాటం ఉంటుంది. ఇక దర్శకులకు, ఇతర సాంకేతికనిపుణులకు నటులుగా తెరపై కనిపించాలనే యావ ఉంటుంది. ఇటీవలే తెలుగు యంగ్‌హీరో రాహుల్ రవీంద్రన్ 'చి.ల.సౌ' చిత్రం ద్వారా దర్శకుడయ్యారు. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. ఇక తెలుగులో కూడా టాప్‌స్టార్ డైరెక్టర్స్ అప్పుడప్పుడు వెండితెరపై తళుక్కున మెరుస్తూ ఉంటారు. ఇక కోలీవుడ్‌లో అయితే జివి ప్రకాష్, విజయ్ ఆంటోని వంటి సంగీత దర్శకులు హీరోలుగా మారారు.
ఇక విషయానికి వస్తే దక్షిణాదిలోనే విలక్షణ దర్శకునిగా గౌతమ్ వాసుదేవ మీనన్‌కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా పలు డబ్బింగ్ చిత్రాల ద్వారానే గాక వెంకటేష్‌తో 'ఘర్షణ', నాగచైతన్య, సమంతలతో 'ఏ మాయచేశావే', నానితో 'ఎటో వెళ్లిపోయింది మనసు' వంటి చిత్రాలను తెరకెక్కించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల ఈయన 'గోలీసోడా 2'లో పోలీస్ అధికారిగా చిన్న పాత్రను చేశాడు.
ప్రస్తుతం ఈయన ఇంత లేటు వయసులో కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జై దర్శకత్వం వహిస్తుండగా, హీరోహీరోయిన్లుగా గౌతమ్‌మీనన్, ఇవానాలు నటించనున్నారు. దర్శకుడు 'జై'కి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. మరి ఈ చిత్రంతో ఆయన నటునిగా బిజీగా మారుతాడేమో వేచిచూడాల్సివుంది....!