ఈసారి మాయ చేసేది ఎవరో తెలుసా?

Anushka to star in Ye Maya Chesave 2

'భాగమతి' చిత్రం తర్వాత స్వీటీ అనుష్క మరో చిత్రం ఒప్పుకోలేదు. ఇటీవల తెలుగులో ఓ చిత్రం చేయనుందని, అందులో నేచురల్‌ స్టార్‌ నాని కూడా ఓ ముఖ్య పాత్రను చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే దీనికి ముందే ఆమె గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ గురించి కోలీవుడ్‌ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. తెలుగులో నాగచైతన్య, సమంత జంటగా 'ఏ మాయ చేశావే' చిత్రం వచ్చి ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా చైతుకు మొదటి హిట్‌, తెలుగు పరిశ్రమకు సమంత పరిచయం కావడం, చైతు, సమంతలు ఈ చిత్రం షూటింగ్‌లోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం.. ఇలా ఈ సినిమాకి ఎన్నో ప్రాముఖ్యతలున్నాయి. 

ఇదే చిత్రం తమిళంలో శింబు, త్రిష జంటగా 'వీన్నైతాండి వరువాయా'గా విడుదలై హిట్‌ కొట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'వీటీవీ 2'(వీన్నైతాండి వరువాయా సీక్వెల్‌) రూపొందనుంది. ఇందులో హీరోగా శింబునే నటిస్తున్నప్పటికీ.. హీరోయిన్‌గా మాత్రం త్రిష స్థానంలో స్వీటీ అనుష్కను పెట్టుకోనున్నారని తెలుస్తోంది. శింబు, అనుష్కలు గతంలో 'వానమ్‌' అనే చిత్రంలో నటించగా, ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ విధంగా చూసుకుంటే శింబు, అనుష్క, గౌతమ్‌మీనన్‌ల కాంబినేషన్‌లో వచ్చే 'వీటీవీ 2' పై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. 

Anushka in sequel of Ye Maya Chesave

anushka shetty
simbu
sequel
ye maya chesave
ye maya chesave 2