మహేష్‌బాబు ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న తన 25వ చిత్రం టైటిల్‌లోని ఇంగ్లీషు అక్షరాలను ఒకటొక్కటిగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం అందరు మొదటి రెండు మూడు అక్షరాలను బట్టే ఈ చిత్రం టైటిల్ 'రిషి' అని ఫిక్స్ అయ్యారు. ఎట్టకేలకు అందరు ఊహించినట్లుగానే ఈ చిత్రానికి 'రిషి' అనే టైటిల్‌నే ఫిక్స్ చేసినట్లు అర్ధమవుతోంది. మహేష్ కొత్త సినిమా టైటిల్‌పై సందేహాలు వీడిపోయాయి. 'రిషి'ని కలుసుకోవడానికి 9వ తేదీ వరకు వెయిట్ చేయండి అని దర్శకుడు వంశీపైడిపల్లి తెలిపాడు.
సినిమా టైటిల్ అని ప్రకటించకపోయినా రిషి జర్నీ అని తెలపడంతో ఇది రిషీ అనే వ్యక్తి జీవితం అనేది స్పష్టం అవుతోంది. 9వ తేదీ ప్రవేశించి రాత్రి 12 గంటలకు మొదటి పోస్టర్‌ని, 9వ తేదీ ఉదయం 9గంటలకు రెండో పోస్టర్‌ని విడుదల చేయనున్నట్లు సమాచారం. పోస్టర్స్ విడుదల తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు 25వ చిత్రంపై భారీ అంచనాలు పెరగడం ఖాయమని అంటున్నారు. ఇక దిల్‌రాజు, అశ్వనీదత్‌ల భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.