అక్కినేని నాగార్జున చిన్నకుమారుడు అక్కినేని అఖిల్ నెలల వయసు ఉండగానే 'సిసింద్రీ' చిత్రంలో నటించాడు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం'లో తళుక్కున మెరిశాడు. తర్వాత సినిమా ఎంట్రీకి ముందే పలు ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ అంబాసిడర్స్‌కి ప్రచార కర్తగా పనిచేశాడు. ఇక ఈయన తన తొలి చిత్రంగా తన సొంత నిర్ణయంతో వి.వి.వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మాతగా 'అఖిల్' చిత్రం చేశాడు. మొదటి చిత్రంతోనే యాక్షన్ అండ్ మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలన్న ఆయన ఆశ నెరవేరలేదు. ఆయన మొదటి చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక రెండో చిత్రం బాధ్యతలను తన తండ్రి నాగార్జునకి అప్పగించాడు. నాగార్జున ఎందరు దర్శకులనో పరిశీలించి చివరకు తమ ఫ్యామిలీకి 'మనం'వంటి హిట్ ఇచ్చిన ఇంటెలిజెంట్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్‌కి అఖిల్ రెండో చిత్రం 'హాలో'ని అప్పగించాడు. ఈ చిత్రం క్లాస్ మూవీగా ఓకే అనిపించింది. కానీ ఒకప్పుడు వచ్చిన 'మనసంతా నువ్వే'కి కాపీలా ఉండటంతో కమర్షియల్‌గా ఈ చిత్రం కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అఖిల్ 'తొలిప్రేమ' అనే తొలి చిత్రంతోనే మంచి లవ్‌స్టోరీని తెరకెక్కించి సూపర్‌హిట్ కొట్టి 'ఫిదా' తర్వాత వరుణ్‌తేజ్‌కి వరుసగా రెండో హిట్ అందించాడు. దాంతో ఈ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలోనే అఖిల్ బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం అఖిల్‌కి ముచ్చటగా మూడో చిత్రం. మరి ఈ చిత్రమైనా అఖిల్‌కి ఆశించిన విజయం అందిస్తుందేమో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తన మొదటి చిత్రంతో తన పేరునే టైటిల్‌గా పెట్టుకుని, రెండో చిత్రానికి తన తండ్రి, తల్లి నాగార్జున, అమల నటించిన 'నిర్ణయం' చిత్రంలోని 'హలో గురు ప్రేమకోసమేరో' అనే పాటలోని 'హలో' అనే క్యాచీ పదాన్ని టైటిల్‌గా పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్ తన మూడో చిత్రంగా వెంకీ అట్లూరితో చేస్తున్న చిత్రానికి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో నాగార్జున.. తన తండ్రి 'ప్రేమనగర్' చిత్రం తరహాలో దాసరి దర్శకత్వంలో రజనీ హీరోయిన్‌గా 'మజ్ను' చిత్రం చేసి హిట్ కొట్టాడు. నాగార్జునకి మంచి హిట్‌గా నిలిచిన విజయవంతమైన చిత్రాలలో 'మజ్ను'ఒకటి. మరి అదే ఫీట్‌ని అఖిల్ రిపీట్ చేస్తాడో లేదో వేచిచూడాల్సివుంది...!