Advertisementt

డైరెక్టర్ కూడా క్రెడిట్టంతా హీరోకే ఇచ్చాడు!

Wed 08th Aug 2018 04:17 PM
goodachari,adivi sesh,sasikiran,goodachari credit,sasi kiran tikka  డైరెక్టర్ కూడా క్రెడిట్టంతా హీరోకే ఇచ్చాడు!
Goodachari Total Credit Goes to Adivi Sesh, Says Sasi Kiran డైరెక్టర్ కూడా క్రెడిట్టంతా హీరోకే ఇచ్చాడు!
Advertisement
Ads by CJ

హీరో అడివి శేష్ కథతో తెరకెక్కిన 'క్షణం' చిత్రంకు డైరెక్టర్ గా పని చేసిన  రవికాంత్ పేరెపు.. ఆ తర్వాత ఆయన ఒక్క సినిమా కూడా చేయలేదు. 'క్షణం' సక్సెస్ కి మెయిన్ కారణం అడివి శేష్ అని తెలిసిన విషయమే. కానీ ఆ సినిమాను డైరెక్ట్ చేసిన రవికాంత్ పేరెపుకు అంతగా పేరు రాకపోవడమే కాదు.. ఆయన డైరెక్టర్ గా ఇంకో సినిమా చేయడానికి ఛాన్స్ కూడా రాలేదు.

అలానే లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి వండర్స్ ను క్రియేట్ చేస్తున్న ‘గూఢచారి’ సినిమాకి కూడా అడివి శేషే కథ అండ్ స్క్రీన్ ప్లే అందించాడు. సో దాంట్లో కూడా అడివి శేష్ కే ఎక్కువ క్రెడిట్స్ వచ్చాయి. మరి ఈ చిత్రం తర్వాత దర్శకుడు శశికిరణ్ కెరీర్ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరు ఏమనుకున్నా ‘గూఢచారి’ సక్సెస్ క్రెడిట్లో అడివి శేష్‌ కు మెయిన్ క్రెడిట్స్ ఇవ్వాలని ఆ సినిమా డైరెక్టర్ శశికిరణ్ కూడా అంటున్నారు.

ఈ సినిమా తర్వాత తనకు ఏ సినిమా తీయాలో అర్ధం కావట్లేదని.. మళ్లీ అడివి శేష్ తోనే పని చేయాలని ఉందని అన్నారు. అసలు నాకు యాక్షన్ సినిమాలంటే అంతగా ఇష్టం ఉండదని.. యాక్షన్ ఎపిసోడ్స్.. షాట్ మేకింగ్ ఎలా తీయాలో తనకు తెలియకపోతే ఈ సినిమాకు ముందు నేర్చుకున్నానని ఆయన చెప్పారు. తన తర్వాత సినిమా కోసం ఇంకా కథ అనుకోలేదని... కాకపోతే కొన్ని ఐడియాస్ ఉన్నాయని.. నిర్మాతలు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని.. ఒక సినిమా బయట చేసి మళ్లీ శేష్ తోనే ఇంకో సినిమా చేయాలనుకుంటున్నానని అన్నాడు శశి.

Goodachari Total Credit Goes to Adivi Sesh, Says Sasi Kiran :

GoodaChari Movie Director about Adivi Sesh 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ