కరెంట్, అడ్డా, కాళిదాసు ఇలా ఏ సినిమా చేసినా హీరోగా నిలదొక్కుకోలేని సుశాంత్ కి అప్పట్లో అక్కినేని ఫ్యామిలీ అండదండలు అంతంత మాత్రమే. ఎప్పుడు తన తల్లి నాగ సుశీల వెనుకే ఉండే సుశాంత్ మొదటి సారిగా చి. ల.సౌ సినిమా విషయంలో తనకి తానుగా ఓన్ డెసిషన్ మీదే నిలుచున్నాడు. ఇక హీరోగా అవకాశాలు రాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారినప్పటికీ... పెద్ద ఉపయోగం లేక.. అందమైన ప్రేమ కథలను తయారు చేసుకుని డైరెక్షన్ కోసం రెడీ అయిన రాహుల్ రవీంద్రన్ కి బెస్ట్ ఆప్షన్ గా తనకి మొదటి అవకాశం ఇచ్చాడు సుశాంత్. ఇక సుశాంత్ ఇచ్చిన అవకాశాన్ని రాహుల్ బాగా వినియోగించుకున్నారు. ఇక సినిమా పూర్తయ్యి మంచి బజ్ వస్తుంది అనుకుంటే రాహుల్ డైరెక్షన్ కి కొత్త, సుశాంత్ కి మార్కెట్ లేకపోవడంతో.. రాహుల్ మెల్లగా తన భార్య చిన్మయితో ఆమె ఫ్రెండ్ అక్కినేని కోడలు సమంతని కదపగా.. సమంత.. నాగ చైతన్యని, నాగ చైతన్య.. నాగార్జునని ఒప్పించి ఈ సినిమాని వారికి చూపించి మరీ అన్నపూర్ణ బ్యానర్ నుండి విడుదల చేసేలా ఏర్పాట్లు జరిగాయి.
ఒక విధంగా అక్కినేని వారు మొత్తం రంగంలోకి దిగి మరీ సుశాంత్ చి.ల సౌ ని ప్రమోట్ చేశారు. ఇక సినిమా గత శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అమ్మయ్య అక్కినేని ఫ్యామిలీ చేసిన హెల్ప్ తో సుశాంత్ సినిమా సూపర్ డూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది అనుకున్నారు అంతా. సినిమా హిట్.. టాక్ పాజిటివ్.. కానీ కలెక్షన్స్ చాలా చాలా డల్. కారణం చి. ల. సౌ దర్శకుడు రాహుల్ ఫ్రెండ్ అడివి శేష్ గూఢచారి సినిమా హిట్ టాక్ రావడమే కాదు.. సినిమా కలెక్షన్స్ కూడా అదిరిపోతోంది. దాని వల్లే కేవలం సినిమాకి హిట్ టాక్ వచ్చినా... అక్కినేని ఫ్యామిలీ ఎంతగా సపోర్ట్ చేసినా చి. ల సౌ కి ఉపయోగం లేకుండా పోయింది.
మరి అక్కినేని ఫ్యామిలీ మ్యాజిక్ చి. ల. సౌ విషయంలో ఎంత మాత్రం పనిచెయ్యలేదనేది చి.ల.సౌ కలెక్షన్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక చి.ల.సౌ సినిమా విడుదల ముందు సమంత, నాగ చైతన్య, నాగార్జునలు తెగ హడావిడీ చేశారు. కానీ సినిమా విడుదలయ్యాక మాత్రం సామ్ అండ్ చై అండ్ నాగ్ చి.ల.సౌ విషయంలో సైలెంట్ అయ్యారు. ఇక రాహుల్ రవీంద్రన్ అండ్ సుశాంత్ లు చేపడుతున్న ఆన్ లైన్ ప్రమోషన్స్ కూడా ప్రేక్షకుల్లోకి సరిగ్గా చేరుకోలేక. బి.సి సెంటర్స్ లో చి.ల.సౌ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి.