Advertisementt

పారు ప్లేస్ లో దాసుగాడున్నాడు: నాగ్

Wed 08th Aug 2018 03:06 PM
nagarjuna,devadas,nani,first look  పారు ప్లేస్ లో దాసుగాడున్నాడు: నాగ్
Nagarjuna and Nani Response on Devadas First Look పారు ప్లేస్ లో దాసుగాడున్నాడు: నాగ్
Advertisement
Ads by CJ

'దేవ‌దాస్' ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌.. సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌

సి.ధ‌ర్మ‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ 'దేవ‌దాస్‌'. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై  సెప్టెంబ‌ర్ 1న శుభ‌ల‌గ్నం, సెప్టెంబ‌ర్ 27న స్టూడెంట్ నెం.1, సెప్టెంబ‌ర్ 28న చిరుత సినిమాలు విడుద‌లై ఘ‌న విజ‌యాన్నిసాధించాయి. అశ్వ‌నీద‌త్‌ కి ఎంతో క‌లిసొచ్చిన సెప్టెంబ‌ర్ నెల చివ‌రి వారం అంటే..సెప్టెంబ‌ర్ 27న 'దేవ‌దాస్‌' ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని ఈ ఫ‌స్ట్‌లుక్‌ను త‌మ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు.  

ఈ  సంద‌ర్భంగా...'టైటిల్ ప్ర‌కారం నా ప‌క్క‌న పారు ఉండాలి. కానీ నా ప‌క్క‌న ఈ దాసుగాడు ఉన్నాడు. దేవ‌దాస్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. సినిమా ఫ‌న్ రైడ్‌గా ఉంటుంది' అంటూ ట్విట్ట‌ర్ ద్వారా ఫ‌స్ట్ లుక్‌ను నాగార్జున విడుద‌ల చేశారు. 

'1996లో నిన్నేపెళ్లాడ‌తా విడుద‌లైన‌ప్పుడు నాగ్ సార్ స్క్రీన్‌పై ఉంటే నేను దేవి 70 ఎం.ఎం థియేట‌ర్ క్యూలో ఉన్నాను. 2018లో ఇద్ద‌రం క‌లిసి దేవ‌దాస్ ఫ‌స్ట్‌లుక్‌లో ఉన్నాం' అంటూ నేచుర‌ల్ స్టార్ నాని ట్విట్ట‌ర్ ద్వారా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. 

చిత్ర నిర్మాత అశ్వ‌నీద‌త్ చ‌ల‌సాని మాట్లాడుతూ - 'క్లైమాక్స్ మిన‌హా దేవ‌దాస్ షూటింగ్ పూర్త‌య్యింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ 27న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తాం..' అన్నారు. 

కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని, ర‌ష్మిక మండ‌న్నా, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వి.కె, బాహుబ‌లి ప్రభాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్: మోహ‌న్, ఛీఫ్ కో ఆర్డినేటర్: స‌దాశివ‌రావ్, కొరియోగ్ర‌ఫి: బృందా, ప్రేమ్ ర‌క్షిత్, శేఖ‌ర్ మాస్ట‌ర్, మాట‌లు: వెంక‌ట్ డి పాటి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: సాహి సురేష్, సంగీత ద‌ర్శ‌కుడు: మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫ‌ర్: స‌్యామ్ ద‌త్ సైనూదీన్, నిర్మాత‌: అశ్వినీద‌త్ చ‌ల‌సాని,  ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌రామ్ ఆదిత్య‌.

Nagarjuna and Nani Response on Devadas First Look:

Nag and Nani in Devadas movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ