Advertisementt

ఈ హీరోయిన్‌కి సుడి మాములుగా లేదు..!

Wed 08th Aug 2018 02:10 PM
kaira adwani,tamil,star hero,vijay,movie,heroine  ఈ హీరోయిన్‌కి సుడి మాములుగా లేదు..!
Kaira Adwani Busy with Movies ఈ హీరోయిన్‌కి సుడి మాములుగా లేదు..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ లేకపోయినా... టాలీవుడ్ కి రావడం రావడమే సూపర్ స్టార్ మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేసిన కైరా అద్వాని.. ఆ సినిమాలో ఓ అన్నంత ప్రాధాన్యత పాత్ర చెయ్యకపోయినా.. అమ్మడు అందాలకు పడిపోవడంతోనో ఏమో... లేకుంటే అన్ని సినిమాల్లోను హీరోయిన్ పూజ హెగ్డే అంటే బాగోదనో... రామ్ చరణ్ - బోయపాటి సినిమాలో కైరా అద్వానీకి ఛాన్స్ తగిలింది. మరి ఎన్ని సినిమాలు చేసినా రాని అదృష్టం కేవలం మహేష్ బాబు పక్కన నటించడంతో కలిగిన క్రేజ్ తో... రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇంకా ఆ సినిమా పూర్తి కాకముందే కైరా కోసం అప్పుడే కొంతమంది దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారనే టాక్ వినబడుతుంది.

రామ్ చరణ్ సినిమాలో నటిస్తున్న  కైరా అద్వానీకి తెలుగులో మరో బిగ్ ప్రాజెక్ట్ లో అవకాశం తగిలేలా కనబడుతుంది. కేవలం ఇప్పుడు తెలుగులోనే కాదు బాలీవుడ్ లోను కైరా అద్వానీకి ఒక బంపర్ ఆఫర్ తగిలింది. బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాణంలో వస్తున్న గుడ్ న్యూస్ అనే భారీ ప్రాజెక్టులో కైరా అవకాశం దక్కించుకోవడమే కాదు... . తాజాగా కైరా అద్వానీకి సౌత్ లో మరో భారీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కినట్లు సమాచారం. అది కూడా కోలీవుడ్లో రజినీకాంత్ తర్వాత అంతమంది అభిమానగణం ఉన్న ఇళయదళపతి విజయ్ పక్కన విజయ్ 63 లో కైరాకి ఆఫర్ వచ్చిందనే న్యూస్ అయితే కోలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో హల్చల్  చేస్తుంది.

తేరి, మెర్సల్ సినిమాలతో విజయ్ తో కలిసి హిట్ అందుకున్న దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే.. విజయ్ 63 సినిమాలో కైరా ని హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కబోయే.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని.. అలాగే ఈ సినిమాలో విజయ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తాడని టాక్ ఉంది. మరి టాలీవుడ్ లో మహేష్ తో తెరంగేట్రం చేసిన కైరా అద్వానీ.. కోలీవుడ్ లో విజయ్ సినిమాతో తమిళంలోకి తెరంగేట్రం చేస్తుంది. మరి ఇలాంటి బంపర్ ఆఫర్ అవకాశం ఎంతమంది హీరోయిన్స్ కి వస్తుంది చెప్పండి.

Kaira Adwani Busy with Movies:

Kaira Adwani in Tamil Star Hero Vijay Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ