ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో మొదటిసారి తెరకెక్కుతోన్న 'అరవింద సమేత - వీర రాఘవ' సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. దసరా టార్గెట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి డెడ్ లైన్ అంటూ షూటింగ్ ని శరవేగంగా పరిగెత్తిస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలే టైం ఉండడంతో ఈలోపు.. సినిమా షూటింగ్ తో పాటుగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చక్కబెట్టేసే దిశగా త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ల ప్లానింగ్ ఉంది. ఎందుకంటే దసరా బరిలో సినిమాని దింపకపోతే మళ్ళీ అలాంటి మంచి అకేషన్ ఈ సినిమాకి వచ్చే ఏడాది వరకు దొరకడం జరగదు. డిసెంబర్ లో కూడా అనేక సినిమాలు పోటీ పడడం, సంక్రాంతికి బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తో పాటుగా రామ్ చరణ్ సినిమాలు ఉండడంతో ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ లు ఖచ్చితంగా దసరా బరిలో నిలవాలనే తలంపుతోనే షూటింగ్ కి విరామం లేకుండా.. ఎవరూ రెస్ట్ కూడా తీసుకోకుండా చిత్రీకరణ జరుపుతున్నారు.
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో మీద భారీ క్రేజ్ ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ ఉంది. పూజ హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగబాబు కూడా ఒక కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో ఊపందుకుంది.. అలాగే 'అరవింద సమేత' శాటిలైట్స్ హక్కులకు భారీ క్రేజ్ ఏర్పడినట్లుగా ఫిలింసర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. త్రివిక్రమ్ సినిమాల శాటిలైట్స్ హక్కుల రేంజ్ ఎలా వుంటాయో అందరికి తెలిసిందే. మరి త్రివిక్రమ్ సినిమాలన్నీ ఛానల్స్ లో సూపర్ హిట్ అయినవే. అందుకే ఇప్పుడు అరవింద సమేత శాటిలైట్స్ హక్కుల కోసం ఛానల్స్ మధ్య భారీ పోటీ ఏర్పడిందట. అందులో భాగంగానే అరవింద సమేత కోసం 'జీ' ఛానల్ వారు 23.5 కోట్లు ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ సినిమాలంటే 'మా' ఛానల్ ఖచ్చితంగా కొట్టేస్తుంది.
కానీ ఈసారి త్రివిక్రమ్ 'అ...ఆ'... సినిమాని తీసుకున్న 'జీ' తెలుగు వారు త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత కోసం 23.5 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఈ రేంజ్ శాటిలైట్ హక్కుల ద్వారా రావడమంటే మామూలు విషయం కాదు. త్రివిక్రమ్ గత చిత్రం భారీ డిజాస్టర్ అయినా అజ్ఞాతవాసితో సంబంధం లేకుండా ఈ లెవల్లో అరవింద కోసం శాటిలైట్ హక్కులకు డీల్ సెట్ అయ్యింది అంటే.. నిజంగా అది ఒక రికార్డ్ అని చెప్పాలి.