శ్రీదేవి - బోని కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ నుండి వెండితెరకు 'ధఢక్' సినిమాతో పరిచయం అయ్యింది. క్యూట్ అండ్ నార్మల్ లుక్స్ తో జాన్వీ కపూర్ 'ధఢక్' సినిమాలో ఆకట్టుకుంది. అలాగే శ్రీదేవికున్న క్రేజ్ ఆమె మొదటి సినిమాకి బాగా పనిచేసింది. మరి శ్రీదేవికి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణిగా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కావడంతో.. ఆమె కూతురికి శ్రీదేవి స్టార్ డమ్ వచ్చేసినట్లే అనిపిస్తుంది. బాలీవుడ్ లో 'ధఢక్' సినిమా తర్వాత జాన్వికి సౌత్ నుండి ఆఫర్స్ వస్తున్నాయనే టాక్ అయితే బలంగానే వినబడుతుంది. ఇక్కడ టాలీవుడ్ లో దిల్ రాజు, ఎస్ ఎస్ రాజమౌళిల చూపు జాన్వీ కపూర్ మీద పడిందనే ప్రచారం ఓ రేంజ్ లో సాగింది.
అదేమో గాని ఇప్పుడు జాన్వీ కపూర్ ఒక సౌత్ హీరో అంటే కోలీవుడ్ హీరోతో సౌత్ సినిమాల్లోకి అడుగుపెట్టబోతోందని అంటున్నారు. అది కూడా కోలీవుడ్ లో మన్మధగా పేరు తెచ్చుకున్న శింబు సరసన జాన్వీ కపూర్ కోసం జాన్వీ తండ్రి బోని కపూర్ తో చర్చలు జరుగుతున్నట్టుగా కోలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినబడుతున్నాయి. హీరో శింబు తన తదుపరి చిత్రంలో జాన్వీ కపూర్ ని తీసుకుని ఆమెకున్న క్రేజ్ ని వాడుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడని.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కబోయే సినిమాలో జాన్వీని హీరోయిన్ గా సెట్ చేసుకునేందుకు శింబు తన ప్రయత్నాలు స్టార్ట్ చేశాడట.
మరి ఇంతకు ముందు రాజమౌళి, దిల్ రాజుల మీద వచ్చిన న్యూస్ల వలే.. శింబు న్యూస్ కూడా ఫేక్ న్యూసో, లేదంటే నిజమో కానీ... ఈ సౌత్ ఆఫర్స్ ని జాన్వీ ఒప్పుకుంటుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు సౌత్ ప్రేక్షకుల ముందున్న పెద్ద డౌట్. ఇకపోతే జాన్వీ - ఇషాన్ కట్టర్ లు నటించిన 'ధఢక్' సినిమా 100 కోట్ల క్లబ్బుని చేరుకొని.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.