Advertisementt

మహేష్‌ బాబు లుక్‌ అదిరింది..!

Tue 07th Aug 2018 11:02 PM
mahesh babu,abhi bus,vennela kishore,sitara,mahesh babu latest look  మహేష్‌ బాబు లుక్‌ అదిరింది..!
Mahesh Babu Latest Look మహేష్‌ బాబు లుక్‌ అదిరింది..!
Advertisement
Ads by CJ

సినిమాలలో వైవిద్యం చూపే పాత్రలు చేసిన స్టార్‌ హీరో మహేష్‌బాబు. ఆయన కెరీర్‌లో జయాపజయాలకు అతీతంగా 'నిజం, నాని, స్పైడర్‌, భరత్‌ అనే నేను, 1 నేనొక్కడినే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అతిధి'వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక లుక్స్‌పరంగా మాత్రం మహేష్‌ పెద్ద విభిన్నంగా కనిపించిన సందర్బాలు తక్కువ. దాంతో ఆయన యాక్షన్‌ చిత్రంలో నటించినా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేసిన చాక్లేట్‌ బాయ్‌గానే పేరు పొందాడు. మధ్యలో 'పోకిరి, అతిధి, బిజినెస్‌మేన్‌' వంటి మూవీస్‌లో మాత్రం కాస్త డిఫరెంట్‌గా కనిపించాడు. 

ఇక ప్రస్తుతం ఆయన తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వనీదత్‌ల భాగాస్వామ్యంలో ఓ చిత్రం చేస్తున్నాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ 'భరత్‌ అనే నేను' చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా నేనే మహేష్‌నైతే కాస్త రగ్‌డ్‌ లుక్‌లో కనిపిస్తానని చెప్పాడు. అప్పుడు మహేష్‌ సమాధానం ఇస్తూ మీరు కోరుకున్న లుక్‌లోనే నేను నా తదుపరి చిత్రంలో కనిపిస్తానని తెలిపాడు. నాటి నుంచి ఈ చిత్రంలో మహేష్‌ లుక్‌ ఎలా ఉండనుంది? అనే ఆసక్తి మొదలైంది. ఆమధ్య కాస్త సైడ్‌ నుంచి ఆయన గడ్డం పెంచుకున్న ఫ్యామిలీ ఫొటోని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దానికి అదిరిపోయే రెస్పాన్స్‌ లభించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని మహేష్‌ జన్మదినం సందర్భంగా విడుదల చేయనున్నారు. 

తాజాగా మహేష్‌ దాదాపు ఈ చిత్రంలో కనిపించనున్న గెటప్‌లోనే 'అభి బస్‌' యాడ్‌లో నటించాడు. ఈ సందర్భంగా ఆయన గడ్డం, మీసాలతో కూడిన ఫొటోని విడుదల చేశాడు. ఇందులో మహేష్‌ కూతురు బుల్లి సితార, క్లీన్‌షేవ్‌లో వెన్నెలకిషోర్‌లు కూడా ఉన్నారు. ఈ ఫొటోలో మహేష్‌ లుక్కే స్పెషల్‌ అట్రాక్షన్‌ అని చెప్పాల్సిన పనిలేదు. దాదాపు తాజా చిత్రంలో కూడా మహేష్‌ ఇలానే కనిపించనున్నాడని అభిమానులకు కాస్త క్లారిటీ రావడంతో ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

Mahesh Babu Latest Look:

Mahesh Babu Abhi Bus AD Look Sensation in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ