శుక్రవారం విడుదలైన చి.ల.సౌ, గూఢచారి సినిమాలు హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. రెండు సినిమాలు రెండు డిఫ్రెంట్ జోనర్లలో తెరకెక్కిన సినిమాలు. సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ మొదటిసారి డైరెక్ట్ చేసిన చి.ల.సౌ సినిమా కుటుంబ కథా చిత్రంగా.. ప్రేమ, పెళ్లి చూపులు, పెళ్లి అంటూ సాగితే... అడివి శేష్ హీరోగా గూఢచారి సినిమా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఒక రా ఏజెంట్ గా దేశాన్ని కాపాడడానికి పోరాటం చేసే యువకుడిగా అడివి శేష్ అదరగొట్టాడు. మరి ఈ రెండు సినిమాలు హిట్ అవడంతో.. సినిమా చేసిన దర్శకుడు పేరు, హీరోల పేర్లు బాగా హైలెట్ అవుతున్నాయి. కానీ ఆ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ గురించి ఎక్కడా హైలెట్ అయిన సందర్భమే లేదు.
చి.ల.సౌ సినిమాలో హీరోయిన్ గా నటించిన రుహనా శర్మ.. చాలా నేచురల్ గా అస్సలు మేకప్ లేకుండా అందమైన నటనతో అదరగొట్టింది. అందంలో ఏముంటుంది... నటనలో ఉంటుందని అసలందం అన్నట్టుగా రుహనా చి.ల.సౌ సినిమాలో కనబడింది. ట్రెడిషనల్ గా ఒకే డ్రెస్సుతో సహజ సిద్ధంగా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో అయితే సుశాంత్ నే డామినేట్ చేసే నటనతో అదరగొట్టింది కూడా. అంజలి పాత్రలో పెళ్లంటేనే ఇష్టం లేని అమ్మాయిగా... తల్లికోసమే పెళ్లి చూపులకు ఒప్పుకోవడం ఇలా అన్ని సీన్స్ లోను రుహని నటన బావుంది. కానీ ఆ సినిమా విజయంలో ఆమె ఎక్కువ భాగంగా ఆమె పేరు మాత్రం పెద్దగా హైలెట్ కాలేదు. కేవలం హీరో సుశాంత్ అండ్ డైరెక్టర్ రాహుల్ పేర్లు మాత్రం మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి.
ఇక స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన గూఢచారి సినిమాలో హీరోయిన్ పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. కానీ అడివిశేష్ ని ప్రేమలో పడేసి.. ఆ ప్రేమతోనే అడివిశేష్ రహస్యాలను విలన్స్ కి చేరవేసే పాత్రలో శోభిత దూళిపాళ బాగానే మెప్పించింది. కాకపోతే అలాంటి థ్రిల్లర్ సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలకు అస్సలు ప్రాధాన్యత ఉండదు. ఇక సినిమాలో అడివి శేష్, శోభిత ట్రాక్ కాస్త లాగింగ్ గా ఉందన్నారు. అయినా శోభిత దూళిపాళ హీరోయిన్ మెటీరియల్ కాదు. అందుకే ఆమెకి అంతగా పేరు రాలేదు. కానీ ఈ సినిమాలో కీ రోల్ పోషించిన అక్కినేని నాగ్ మేనకోడలు సుప్రియ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా తర్వాత సుప్రియను తమ సినిమాల్లో కీ రోల్స్ గా తీసుకోవడానికి దర్శకనిర్మాతలకు ఇష్టపడవచ్చు. కానీ శోభితకి మళ్ళీ అవకాశాలు వస్తాయో రావో అనేది మాత్రం కాస్త సస్పెన్స్.