Advertisementt

మహేష్ 25వ మూవీ టైటిల్ ఇదేనా?

Tue 07th Aug 2018 10:33 AM
mahesh babu,vamsi paidipalli,25th movie,title,confirme  మహేష్ 25వ మూవీ టైటిల్ ఇదేనా?
Mahesh 25th film Title Confirmed మహేష్ 25వ మూవీ టైటిల్ ఇదేనా?
Advertisement
Ads by CJ

మహేష్ - వంశి పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న మహేష్ 25 వ సినిమా షూటింగ్ విరామమే లేకుండా జరుగుతోంది. సినిమా మొదలవ్వడానికి కాస్త సమయం తీసుకున్న మహేష్ 25 మూవీ టీమ్ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి పరిగెత్తిసున్నారు. వంశి పైడిపల్లి డైరెక్షన్ లో ముగ్గురు బడా నిర్మాతలైన దిల్ రాజు, అశ్విని దత్, పివిపి లు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల చేస్తామని చెప్పడంతో ఇప్పట్లో మహేష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ బయటికి రాదని మహేష్ అభిమానులు కాస్త ఫీల్ అయ్యారు.

కానీ మహేష్ పుట్టినరోజు అంటే ఆగష్టు 9 నే మహేష్ కొత్త సినిమా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ కూడా రాబోతుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ రోజుకో లెటర్ లోగోతో అంటే మహేష్ చిత్ర టైటిల్ లోని ఒక్కో అక్షరాన్ని.. ఆ అక్షరంలో మహేష్ గత సినిమాల ఫొటోస్ తో పాటుగా వదులుతూ...  అందరిలో క్యూరియాసిటీ పెంచేస్తుంది. అయితే మూవీ టీమ్ వదులుతున్న ఆ అక్షరాల్లోనే మహేష్ 25 మూవీ టైటిల్ దాగుందని.. సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చగా జరుగుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన ఆర్, ఐ, ఎస్ అక్షరాలను కలుపుతూ మహేష్ మూవీ టైటిల్ 'రిషి (RISHI)' అంటూ ప్రచారం చేస్తున్నారు.

మరి మహేష్ 25 మూవీ టైటిల్ గా గతంలోనే 'రాజసం' అనే టైటిల్ గా బాగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మూవీ టీం కన్ఫ్యూషన్ లో పడిన ప్రేక్షకులు మహేష్ టైటిల్ ని 'రిషి' గా అనుకుంటున్నారు. మరి ఈ మూడు రోజుల్లో మహేష్ టైటిల్ విషయంలో ఇంకెంత ఆకస్తికర టైటిల్స్ బయటికొస్తాయో గాని.. ప్రస్తుతం మాత్రం మహేష్ టైటిల్ గా 'రిషి' అనే టైటిల్ మాత్రం ప్రచారం జరుగుతుంది. మరి ఫైనల్ గా వంశి పైడిపల్లి - మహేష్ ల చిత్ర టైటిల్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీకి తెర పడాలంటే ఆగష్టు 9 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

Mahesh 25th film Title Confirmed:

Rishi is the mahesh babu 25th film Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ