Advertisementt

ఆ టైపు బోల్డ్‌ చిత్రాలకు వ్యతిరేకిని: మంచులక్ష్మి!

Mon 06th Aug 2018 10:35 PM
manchu lakshmi,bold content,arjun reddy,rx 100  ఆ టైపు బోల్డ్‌ చిత్రాలకు వ్యతిరేకిని: మంచులక్ష్మి!
Manchu Lakshmi About Arjun Reddy and RX 100 ఆ టైపు బోల్డ్‌ చిత్రాలకు వ్యతిరేకిని: మంచులక్ష్మి!
Advertisement
Ads by CJ

బోల్డ్‌ చిత్రాలు ఎంత విజయం సాధించినా, అందులోని వివాదాస్పద కంటెంట్‌, సీన్స్‌ వల్ల ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురవుతాయి. దానికి 'అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100' వంటి చిత్రాలే ఉదాహరణ. నేటితరం ఈ తరహా చిత్రాలకు బ్రహ్మరథం పడుతుంటే, పాత సినీ ప్రేక్షకులు, సంప్రదాయవాదులు మాత్రం వీటిపై మండిపడుతూ ఉంటారు. ఇక తాజాగా మంచు లక్ష్మి ఈ రెండు చిత్రాలపై స్పందించింది. నటిగా, నిర్మాతగా మంచి పేరున్న మంచు లక్ష్మీ ఓపెన్‌గా మాట్లాడుతుందనే పేరు కూడా ఉంది. ఇక ఈమెకి తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌100' వంటి బోల్డ్‌ చిత్రాలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

ఆమె మాట్లాడుతూ.. 'అర్జున్‌రెడ్డి' చిత్రాన్ని నేను సెన్సార్‌ కట్స్‌ లేకుండా ఆమెజాన్‌ ప్రైమ్‌లో చూశాను. అందులో నాకు తెలిసి ఎలాంటి వల్గారిటీ లేదు. 'ఆర్‌ఎక్స్‌100' చిత్రాన్ని ఇంకా చూడలేదు. మీరన్నట్లుగా అందులో కూడా బోల్డ్‌ కంటెంట్‌ ఉందని విన్నాను.నేను చూడలేదు కనుక ఆ చిత్రం గురించి నేను మాట్లాడను. లాభాల కోసం వల్గారిటీ ఉన్న చిత్రాలలో నటించడానికి నేను బద్ద వ్యతిరేకిని. 'పెళ్లిచూపులు, క్షణం, మహానటి' చిత్రాలు ఎంతో బాగా ఆడాయి. అలా మంచి కథా నేపధ్యం.. పాత్ర ప్రాధాన్యత కలిగిన చిత్రాలలో మాత్రమే చేయాలనేది నా కోరిక..అని తెలిపింది. 

ఇక మంచు లక్ష్మి విభిన్న ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పటికీ ఆమె నటించిన ఏ చిత్రం కూడా బాగా ఆడిన సందర్భాలు లేవు. ఇటీవల వచ్చిన 'వైఫ్ అఫ్ రామ్‌' చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయింది. మరి భవిష్యత్తులో ఈమె ఎలాంటి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో వేచిచూడాల్సివుంది.

Manchu Lakshmi About Arjun Reddy and RX 100:

Manchu Lakshmi Opposite to Bold Content Films

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ