Advertisementt

టాప్ 5 కాదు.. టాప్ 1 సినిమా: నితిన్!

Mon 06th Aug 2018 06:19 PM
srinivasa kalyanam,special premiere,nithiin,dil raju,raashi khanna,nanditha swetha,satesh vegesna  టాప్ 5 కాదు.. టాప్ 1 సినిమా: నితిన్!
Srinivasa Kalyanam Special Premiere for Movie Unit టాప్ 5 కాదు.. టాప్ 1 సినిమా: నితిన్!
Advertisement
Ads by CJ

'శ్రీనివాస క‌ళ్యాణం' స‌క్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం -  నిర్మాత‌ దిల్‌రాజు 

 

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యూత్‌స్టార్ నితిన్ హీరోగా, రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా.. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీశ్‌, ల‌క్ష్మ‌ణ్ నిర్మించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'శ్రీనివాస క‌ళ్యాణం'. ఆగ‌స్ట్ 9న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ స్పెష‌ల్ మూవీ ప్రీమియ‌ర్‌ను వీక్షించారు. 

అనంత‌రం .... సినిమా చాలా బాగా వ‌చ్చింది.. ప్రేక్ష‌కుల రెస్పాన్స్ కోసం వెయిటింగ్ 

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. స‌తీశ్ పాయింట్ చెప్పిన‌ప్పుడు ... జ‌య‌సుధ‌గారు, నితిన్, ప్రకాశ్‌రాజ్‌గారు అంద‌రూ ఫోన్ చేసి క‌థ బావుంద‌ని చెప్పారు. శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత నేను, స‌తీశ్ చేసిన ట్రావెల్. సినిమా బావుంద‌ని అంద‌రూ చెబుతున్నారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేక్ష‌కుల రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈరోజు మేం ప‌డ్డ క‌ష్టానికి రేపు రాబోయే రిజ‌ల్ట్ గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం. అయితే సినిమా హిట్ అవుతుంద‌ని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సంద‌ర్బంలో క‌ళామందిర్ క‌ల్యాణ్‌గారి స‌పోర్ట్‌తో .. శ్రావ‌ణ మాసంలో పెళ్లి చేసుకోబోతున్న జంట‌ల‌కు మా శ్రీనివాస క‌ళ్యాణం టీమ్ ప‌ట్టు వ‌స్త్రాల‌ను అందించ‌బోతుంది.  మీ వెడ్డింగ్ కార్డ్ పంపిస్తే.. మేం ప‌ట్టు వ‌స్త్రాలు పంపిస్తున్నాం. కొన్ని సెల‌క్టెడ్ జంట‌ల‌కు మా యూనిట్ వచ్చి నేరుగా ప‌ట్టు వ‌స్త్రాల‌ను అందిస్తారు.. అన్నారు. 

నా కెరీర్‌లోనే టాప్ మూవీ

యూత్‌స్టార్ నితిన్ మాట్లాడుతూ - నా కెరీర్‌లో టాప్ 5 సినిమాల్లో ఇదొక‌టి అవుతుంద‌ని ఆడియో ఫంక్ష‌న్ రోజు చెప్పాను. కానీ ఇప్పుడు సినిమా చూసిన త‌ర్వాత టాప్ వ‌న్ మూవీ అయ్యేలా ఉంద‌నిపిస్తుంది. సినిమా చూసిన త‌ర్వాత అంద‌రూ వారి జీవితాల‌ను క‌నెక్ట్ చేసుకుని ఆనంద బాష్పాలు రాల్చారు. సినిమా త‌ర్వాత దిల్‌రాజుగారికి మీ బ్యాన‌ర్‌లో బెస్ట్ హిట్ అవుతుంద‌ని చెప్పాను. ఈరోజు బ‌య్య‌ర్లు కూడా అదే చెబుతున్నారు. స‌తీశ్‌గారికి థాంక్స్‌.. అన్నారు. 

సినిమా విడుద‌ల త‌ర్వాత మాట్లాడుతా...

చిత్ర ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న మాట్లాడుతూ - సినిమా విడుద‌లైన త‌ర్వాత సినిమా గురించి.. అందులో న‌టించిన వారి గురించి మాట్లాడితే క‌రెక్ట్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాను.. అన్నారు. 

హీరోయిన్ రాశీ ఖ‌న్నా మాట్లాడుతూ..సినిమా చూసిన త‌ర్వాత చాలా ఎమోష‌న‌ల్ అయిపోయాను. చిన్న‌పిల్ల‌లు నుండి పెద్ద వారి వర‌కు సినిమా న‌చ్చుతుంది. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంది. ఇందులో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది. స‌తీశ్‌గారికి హ్యాట్సాఫ్‌. ఇది సినిమా కాదు. ఓ ఎక్స్‌పీరియెన్స్‌.. అన్నారు. 

హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడుతూ- సినిమాలో ప‌ద్మావ‌తి అనే క్యారెక్ట‌ర్ చేశాను. నా పేవ‌రేట్ క్యారెక్ట‌ర్‌. వ్య‌క్తిగ‌తంగా మ‌న పెళ్లి, సంప్ర‌దాయాలు గురించి తెలుసుకున్నాను. దిల్‌రాజు, శిరీశ్‌, ల‌క్ష్మ‌ణ్‌గారికి, స‌తీశ్‌గారికి థాంక్స్‌.. అన్నారు. 

Srinivasa Kalyanam Special Premiere for Movie Unit:

Srinivasa Kalyanam Special Premiere Press Meet details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ