'మహానటి' చిత్రంలో తన తాత అక్కినేని నాగేశ్వరావు పాత్రను ఆయన మనవడు నాగచైతన్య పోషించాడు. ఇక తాజాగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రగా బాలకృష్ణ నటిస్తున్న 'ఎన్టీఆర్' చిత్రంలో ఏయన్నార్ పాత్రకి అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్‌ని ఎంపిక చేశారు. క్రిష్ ఈ పాత్రకు సుమంత్ అయితేనే బాగుంటుందని భావించి ఆయన్నే తీసుకున్నాడు. సుమంత్ విషయానికి వస్తే 'ప్రేమకథ' ద్వారా పరిచయమై తర్వాత 'యువకుడు, సత్యం, గౌరి, గోదావరి, మహానంది' వంటి పలు చిత్రాలలో నటించాడు. మామయ్య నాగార్జునతో 'స్నేహమంటే ఇదేరా'లో యాక్ట్ చేశాడు.
ఇక ఇటీవల ఆయన నటించిన 'మళ్లీరావే' చిత్రం మంచి చిత్రంగా ప్రశంసలు అందుకుంది. 'ఎన్టీఆర్' బయోపిక్‌లో చంద్రబాబునాయుడు పాత్రను రానా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఖరారైన ఒకటి రెండు రోజులకే ఏయన్నార్ పాత్ర కూడా ఫైనల్ కావడం విశేషం. దీనిపై సుమంత్ స్పందిస్తూ, ఎన్టీఆర్ జీవితంలో ఏయన్నార్ పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉందని, ఏయన్నార్ పాత్రను సుమంత్ పోషిస్తున్నట్లు అధికారికంగా యూనిట్ ప్రకటించింది. దీనిపై సుమంత్ సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో తాతగారి పాత్రను పోషిస్తున్నానని, ఈ పాత్ర తనకి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని సుమంత్ తెలిపాడు.
ఇక ఏయన్నార్ పాత్ర ఎన్టీఆర్ బయోపిక్‌లో కేవలం సినిమాల వరకే పరిమితం కాగా, సూపర్‌స్టార్ కృష్ణ పాత్ర మాత్రం సినిమాలతోపాటు రాజకీయాలలో కూడా సాగింది. గత కొంతకాలంగా 'ఎన్టీఆర్' బయోపిక్‌లో కృష్ణ పాత్రను మహేష్‌బాబు పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ పాత్రను సీనియర్ నరేష్ లేదా సుధీర్‌బాబులు పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.