Advertisementt

రమ్యకృష్ణ 'రాణి శివగామి' ఫస్ట్‌లుక్ అదిరింది!

Sun 05th Aug 2018 09:06 PM
raani sivagami,frist look,ramya krishna,bonalu festival special  రమ్యకృష్ణ  'రాణి శివగామి' ఫస్ట్‌లుక్ అదిరింది!
Raani Sivagami First Look Released రమ్యకృష్ణ 'రాణి శివగామి' ఫస్ట్‌లుక్ అదిరింది!
Advertisement
Ads by CJ

బోనాల పండుగ కానుకగా రమ్యకృష్ణ 'రాణి శివగామి' ఫస్ట్‌లుక్ విడుదల  

తన అసమాన అభినయంతో ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి..నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ. ఇటీవల బాహుబలి సీరిస్‌లో రాజమాత శివగామిగా పవర్‌ఫుల్ పాత్రలో అద్భుతమైన అభినయంతో అందర్ని అలరించిన ఈ సీనియర్ నటి ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకుంటోన్న శక్తివంతమైన చిత్రం 'రాణి శివగామి'. రమ్యకృష్ణ టైటిల్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి మధు మిణకన్ గుర్కి దర్శకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ పతాకంపై మురళీకృష్ణ దబ్బుగుడి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు ఫస్ట్‌లుక్‌ను బోనాల పండుగ సందర్భంగా విడుదల చేశారు. 

ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం  విశేషాలను నిర్మాత తెలియజేస్తూ.. రమ్యకృష్ణ నటిస్తున్న మరో పవర్‌ఫుల్ చిత్రమిది. ఆమెను కొత్తకోణంలో ఆవిష్కరించే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. పీరియాడిక్ డ్రామా విత్ సోషియోఫాంటసీగా రూపొందుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. త్వరలోనే ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. చిత్రాన్ని ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. అని తెలిపారు. 

దర్శకుడు మాట్లాడుతూ.. తొమ్మిదవ శతాబ్ధంలో ప్రారంభమయ్యే ఈ కథ 21వ శతాబ్ధం వరకు కొనసాగుతుంది. ఈ కాలఘట్టంలో జరిగే సంఘటనలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి. తొమ్మిదవ శతాబ్ధానికి, 21వ శతాబ్దనికి వున్న సంబంధం ఏమిటనేది ఈ చిత్ర కథ. యుద్ద సన్నివేశాలు,  గ్రాఫిక్స్ ఆకట్టుకునే విధంగా వుంటాయి. శివగామిగా రమ్యకృష్ణ నటన చిత్రానికి ప్రధాన హైలైట్‌గా వుంటుంది.. అన్నారు. 

రమ్యకృష్ణ, రవికాలే, గోలీసోడా మధు, అవినాష్, ప్రవీణ్, పాయల్ రాధాకృష్ణ, రమేష్ పండిట్, కారుమంచి రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వీర్ సమ్రత్, కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: కెఎమ్ ప్రకాష్, ఆర్ట్: బాబుఖాన్, సహ నిర్మాతలు: దబ్బుగుంట వెంకటశేషయ్య యాదవ్, దబ్బుగుంట మహేష్‌కుమార్ యాదవ్, నిర్మాత: మురళీ కృష్ణ దబ్బుగుడి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మధు మిణకన గుర్కి. 

Raani Sivagami First Look Released:

Ramya Krishna New Raani Sivagami First Look Release on the Occasion Of Bonaalu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ