తాజాగా విడుదలైన అడవి శేషు 'గూఢచారి', రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా నటించిన 'చిలసౌ' చిత్రాలు మంచి విజయం దిశగా సాగుతున్నాయి. 'గూఢచారి' చిత్రంలో అక్కినేని ఫ్యామిలీకి చెందిన యార్లగడ్డ సుప్రియ కీలకపాత్ర చేయగా, 'చిలసౌ'లో కూడా అదే ఫ్యామిలీకి చెందిన సుశాంత్ హీరోగా నటించాడు. ఇక విషయానికి వస్తే అక్కినేని ఫ్యామిలీ కోడలు స్టార్ హీరోయిన్ సమంత మేనేజర్ మహేంద్ర తాజాగా ఈ రెండు చిత్రాల విజయాలను పురస్కరించుకుని ఓ పార్టీని ఏర్పాటు చేశాడు. ఇందులో రెండు చిత్రాలలోనూ నటించిన వెన్నెలకిషోర్, రాహుల్‌రవీంద్రన్, మహేంద్రలు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు. ఈ విషయాలన్ని, ఫొటోలను సమంత మేనేజర్ మహేంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని చాటాడు.
ఈ చిత్రాల సక్సెస్‌లను ఎంజాయ్ చేస్తున్నానని, రాహుల్‌రవీంద్రన్, అడవిశేష్ కోసం తాను వెయిట్ చేస్తున్నానని ఈయన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ని చూసిన అక్కినేని ఇంటి కోడలు సమంత.. ఈ ట్వీట్‌ను ఎవరు టైప్ చేశారు? ముందు అది చెప్పు..అని ప్రశ్నించింది. ఈ పార్టీకి నన్నెందుకు పిలవలేదు.. అంటూ చిరు ఆగ్రహాన్ని ప్రదర్శించింది. దీంతో టాలీవుడ్ బ్యూటీకి కోపమొచ్చిందని, అందుకే తనను ఎందుకు పార్టీకి పిలవలేదంటూ చిలిపి కోపాన్ని ప్రదర్శించిందని అర్ధమవుతోంది. ప్రస్తుతం సమంత స్పందించిన ట్వీట్ వైరల్ అవుతోంది.
మరోవైపు హాలీవుడ్ టచ్‌తో రూపొందిన 'గూఢచారి' తెలుగులో ఇప్పటివరకు రాని స్పైథ్రిల్లర్‌గా పేరు పొందితే, చిలసౌ చిత్రం క్లీన్ కామెడీ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తోంది. ఈ రెండు చిత్రాలు అడవిశేష్, సుప్రియ యార్లగడ్డ, దర్శకుడు శశికిరణ్, సుశాంత్, రాహుల్‌రవీంద్రన్ వంటి వారికి తమ తమ కెరీర్‌లోనే గుర్తుండిపోయే చిత్రాలుగా మిగలడం ఖాయమని అంటున్నారు. మరోవైపు ఈ రెండు చిత్రాల హిందీ రీమేక్ హక్కుల కోసం బాగా డిమాండ్ ఏర్పడిందని తెలుస్తోంది.