Advertisementt

అడవిశేష్‌ - సుశాంత్‌లతో బ్రాండ్ బద్దలవుతోంది!

Sun 05th Aug 2018 02:25 PM
goodachari,chi la sow,brand babu,tollywood,hit,flop  అడవిశేష్‌ - సుశాంత్‌లతో బ్రాండ్ బద్దలవుతోంది!
Chi la Sow and Goodachari Hit and Brand Babu Failed at Box Office అడవిశేష్‌ - సుశాంత్‌లతో బ్రాండ్ బద్దలవుతోంది!
Advertisement
Ads by CJ

గత కొన్నివారాలుగా ఇండస్ట్రీ స్తబ్దుగా ఉంది. ఈ కాలంలో కేవలం 'ఆర్‌ఎక్స్‌ 100' తప్ప మరో చిత్రం ఊసే ఎత్తే పనిలేకుండా పోయింది. ఇక ఈ వారం బాక్సాఫీస్‌ ముందుకు మూడు చిత్రాలు వచ్చాయి. అవి అడవిశేషు 'గూఢచారి', రాహుల్‌ రవీంద్రన్‌-సుశాంత్‌ల 'చి.ల.సౌ'. ఇక మూడో చిత్రం 'బ్రాండ్‌ బాబు'. మారుతి బ్రాండ్‌తో వచ్చిన 'బ్రాండ్‌ బాబు' విషయానికి వస్తే ఈ చిత్రం 'గూఢచారి, చి.ల.సౌ'ల మధ్య నలిగిపోతోంది. ఎవ్వరూ ఈ చిత్రం గురించి పట్టించుకోవడం లేదు. సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించేలా లేకపోవడం, గూఢచారి, చి.ల.సౌలు మంచి టాక్‌ తెచ్చుకోవడంతో బ్రాండ్‌బాబుది క్లిష్టపరిస్థితేనని చెప్పవచ్చు. 

ఇక 'గూఢచారి, చి.ల.సౌ'లు కూడా రెండు విభిన్నమైన జోనర్లకి చెందిన చిత్రాలు. 'గూఢచారి' స్పై థ్రిల్లర్‌గా, 'చి.ల.సౌ' లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా రూపొందాయి. 'గూఢచారి' ఇప్పటివరకు తెలుగులో వచ్చిన స్పైథ్రిల్లర్‌ చిత్రాలలో మోడ్రన్‌టచ్‌ ఉన్న హాలీవుడ్‌ స్టైల్‌ చిత్రంగా ప్రశంసలు పొందుతోంది. ఇక లవ్‌, ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా హీరో రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకునిగా తన మొదటి చిత్రం 'చి.ల.సౌ'లతోనే మంచి పేరు సాధించాడు. ఈ రెండు చిత్రాలకు దర్శకులు కొత్తవారే కావడం మరో విశేషం. 

ఇక 'బ్రాండ్‌బాబు' చిత్రం ఊసే లేకుండా పోయింది. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న 'గూఢచారి', చి.ల.సౌల టాక్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సినీ విశ్లేషకులు, విమర్శకుల నుంచి ఈ రెండు చిత్రాలకు మంచి టాక్‌ రావడంతో ఈ రెండు యూనిట్స్‌ ఫుల్‌ఖుషీలో ఉన్నాయి. ఇక అడవిశేష్‌, రాహుల్‌ రవీంద్రన్‌లు కూడా సోషల్‌మీడియాలో పబ్లిసిటీ పరంగా కూడా దూసుకెళ్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే బ్రాండ్‌ బాబుకి బ్యాండ్‌ పడిందనే చెప్పాలి.  

Chi la Sow and Goodachari Hit and Brand Babu Failed at Box Office:

Goodachari and Chi La Sow Got Good Talk at Box Office  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ