Advertisementt

పెద్దోడు, చిన్నోడు తలో చెయ్యేశారు..!

Sun 05th Aug 2018 11:48 AM
nithin,srinivasa kalyanam,venkatesh,voice over,mahesh babu  పెద్దోడు, చిన్నోడు తలో చెయ్యేశారు..!
Srinivasa Kalyanam Team Thanks to Venkatesh and Mahesh పెద్దోడు, చిన్నోడు తలో చెయ్యేశారు..!
Advertisement
Ads by CJ

విజ‌య‌వంత‌మైన చిత్రాల నిర్మాణ సంస్థ  శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన మ‌ల్టీస్టార‌ర్‌ 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు' సినిమాలో పెద్దోడుగా విక్ట‌రీ వెంక‌టేశ్‌, చిన్నోడుగా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింది. అప్ప‌టి నుండి ఈ సంస్థ‌తో ఇద్ద‌రి ప్ర‌త్యేక అనుబంధం కొన‌సాగుతుంది. ఈ ఏడాది ఇదే బ్యాన‌ర్‌లో పెద్దోడు విక్ట‌రీ వెంక‌టేశ్ 'ఎఫ్ 2'లో నటిస్తుండ‌గా.. చిన్నోడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 25వ సినిమా చేస్తున్నారు. అదే అనుబంధంతో ఈ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'శ్రీనివాస కళ్యాణం' త‌మ స‌పోర్ట్‌ను అందించారు. 

ఈ చిత్రం కోసం వెంక‌టేశ్ త‌న వాయిస్ ఓవ‌ర్‌ను ఇవ్వ‌గా.. మ‌హేశ్ ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఇప్ప‌టికే 3 మిలియ‌న్ వ్యూస్ మార్క్‌ను దాటింది. ఈ అగ్ర క‌థానాయ‌కులిద్ద‌రూ చేసిన స‌పోర్ట్ కు 'శ్రీనివాస క‌ళ్యాణం' యూనిట్ వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.  నితిన్‌, రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత తారాగ‌ణంగా స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'శ్రీనివాస క‌ళ్యాణం' ఆగ‌స్ట్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.

Srinivasa Kalyanam Team Thanks to Venkatesh and Mahesh:

Venkatesh Voice Over to Srinivasa Kalyanam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ