సెన్సారు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ తో GA2 పిక్చర్స్ 'గీత గోవిందం' ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదల
స్టార్ హీరో విజయ్‌దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గీత గోవిందం'. ప్రోడ్యూసర్ బన్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారు సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్నినిర్మించారు. ఈ చిత్రానికి గోపి సుందర్ అందించిన ఆడియో ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా గ్రాండ్ గా విడుదల చేశారు. ఇప్పటికే సింగిల్ గా విడుదలయ్యిన 'ఇంకేమి ఇంకేమి ఇంకేమి కావాలి' సాంగ్ దాదాపు 35 మిలియన్స్ వ్యూస్ తో 4 లక్షల అరవై వేలకి పైగా లైక్స్ ని సాధించి సౌత్ ఇండియాలో ఏ చిత్రానికి రాని విధంగా ట్రెండింగ్ లో వుండటం ఈ చిత్ర యూనిట్ కాన్ఫిడెన్స్ ని డబుల్ చేసింది. ఆడియో14 లక్షల వ్యూస్ కి చేరుకోవటం విశేషం. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబందించిన సెన్సారు కార్యక్రమాలు పూర్తయ్యాయి. U/A సర్టిఫికెట్ తో ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
చిత్ర సమర్పకులు శ్రీ అల్లు అరవింద్ గారు మాట్లాడూతూ.. 'గీత గోవిందం' చిత్రం సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. గోపిసుందర్ ఇచ్చిన ఆడియో ఇప్పటికే ట్రెండింగ్ కావటం హ్యాపిగా వుంది. ఈ చిత్రంలో లుక్ దగ్గర నుండి క్యారక్టరైజేషన్ వరకూ విజయ్ దేవరకొండ అందర్ని ఆకట్టుకుంటాడు. విజయ్ చాలా మంచి ఫ్యాషన్ తో ఈ పాత్ర చేశాడు. పక్కా ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పరుశురాం దర్శకుడిగా మరో మెట్టు ఎక్కాడు. హీరోయిన్ రష్మిక గీత పాత్రలో అద్బుతంగా నటించింది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అని అన్నారు.
దర్శకుడు పరుశురామ్ (బుజ్జి) మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ లో శ్రీరస్తు శుభమస్తు చిత్రం చాలా మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అదే విదంగా మా గీత గోవిందం కూడా ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. గోపిసుందర్ అందించిన ఆడియో సూపర్ హిట్ కావటం చాలా ఆనందంగా వుంది. రోమాంటిక్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 15న మీ దగ్గర వున్న అన్ని దియోటర్స్ లో విడుదలవుతుంది. శ్రీ అల్లు అరవింద్ గారి బ్లెస్సింగ్స్ తో బన్ని వాసు సపోర్ట్ తో ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. సన్సెషనల్ స్టార్ విజయ్ దేవర కొండ క్రేజ్ కి తగ్గట్టుగా వుంటుంది. అర్జున్ రెడ్డి తరువాత విజయ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనే క్యూరియాసిటి వున్న ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. రష్మిక చాలా బాగా చేసింది. సెన్సారు కార్కక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టు 15 డేట్ ని సేవ్ చేసుకోండి.. అని అన్నారు.
నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ అధినేత శ్రీ అల్లు అరవింద్ గారు చిత్ర సమర్పకులుగా నేను నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం గీత గోవిందం సెన్సారు కార్కక్రమాలు పూర్తిచేసుకుంది. ఆడియో ఇప్పటికే చాలా మంచి విజయం సాధించింది. విజయ్ దేవరకొండ సూపర్ ఫెర్‌ఫార్మెన్స్ తో మరొక్కసారి ప్రేక్షకుల ముఖచిత్రాన్ని తనవైపుకు తిప్పుకుంటాడనే నమ్మకం మాకుంది. పరుశురాంకి ఫ్యామిలి ఎమోషన్స్ ని తెరకెక్కించటం వెన్నతో పెట్టిన విద్య. ఈ చిత్రం మరొక్కసారి పక్కా ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ప్రశంసలు పొందుతుంది. గోపిసుందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాన్నాం.. అని అన్నారు.
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, నాగబాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, మౌర్యాని, సుభాష్, అభయ్, స్వప్నక, సత్యం రాజేష్, దువ్వాసి మెహన్, గుండు సుదర్శన్, గౌతంరాజు, అనీష, కళ్యాణి నటరాజన్, సంధ్య జనక్ తదితరులు.