Advertisementt

నాగ్ శాసించాడు.. సమంత పాటిస్తుందా..!

Fri 03rd Aug 2018 03:14 PM
nagarjuna,green challenge,samantha,harithaharam,king nagarjuna  నాగ్ శాసించాడు.. సమంత పాటిస్తుందా..!
King Nagarjuna Akkineni Accepts Green Challenge నాగ్ శాసించాడు.. సమంత పాటిస్తుందా..!
Advertisement
Ads by CJ

గ్రీన్‌ఛాలెంజ్‌ రోజురోజుకు బాగా విస్తృతం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌లు, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, ఆయన పిల్లలు వంటి వారు ఛాలెంజ్‌ని పూర్తి చేశారు. మరోవైపు దర్శకుడు వంశీపైడిపల్లి.. అక్కినేని ఇంటి కోడలు, హీరోయిన్‌ సమంతకు ఛాలెంజ్‌ విసిరిన సంగతి తెలిసిందే. ఇంతలో అక్కినేని నాగార్జున.. సమంత కంటే ముందుగా ఈ ఛాలెంజ్‌ని పూర్తి చేశాడు. తెలంగాణ ఎంపీ సంతోష్‌కుమార్‌ తనని నామినేట్‌ చేయగా ఈ ఛాలెంజ్‌ని నాగ్‌ స్వీకరించాడు. 

తమ అన్నపూర్ణ స్టూడియోస్‌ గార్డెన్‌లో మొక్కలు నాటి ఛాలెంజ్‌ని పూర్తి చేశాడు. తమ సిబ్బందితో కలిసి మొక్కలు నాటి గ్రీన్‌ఛాలెంజ్‌ని పూర్తి చేసిన ఫొటోలను ఆయ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. మీకు మాటిచ్చినట్లే అన్నపూర్ణ స్టూడియోస్‌లో మా సిబ్బందితో కలిసి మొక్కలు నాటాను. ఇక మీవంతు ఫ్రెండ్స్‌...! కరణ్‌జోహార్‌, కార్తి, ధనుష్‌ కె. రాజాలతో పాటు నా కోడలు సమంతను కూడా ఈ ఛాలెంజ్‌కి నామినేట్‌ చేస్తున్నాను. వారు ఈ హరిత విప్లవాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుతున్నాను అని తెలిపాడు. 

కాగా నాగార్జునకు ఎంపీ సంతోష్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన గ్రీన్‌చాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటినందుకు, ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకుని పోతున్నందుకు ఆయన నాగార్జునను అభినందించాడు. ఒకవైపు వంశీపైడిపల్లితో పాటు తన మావయ్య నాగార్జున విసిరిన ఛాలెంజ్‌లను అక్కినేని కోడలు సమంత ఎప్పుడు స్వీకరిస్తుందో వేచిచూడాల్సివుంది..! 

King Nagarjuna Akkineni Accepts Green Challenge:

Nagarjuna Accepts MP Santosh Kumar's Green Challenge

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ