కమల్ హాసన్ ఆల్‌రెడీ రాజకీయ తెరంగేట్రం చేసేసి, పార్టీపేరును, వెబ్‌సైట్‌ని, సభ్యత్వ నమోదును కూడా ప్రారంభించాడు. ఇదే సమయంలో విడుదల ఆగిపోయిన 'విశ్వరూపం 2' చిత్రానికి తానే స్వీయ దర్శకత్వంతో ఆగస్టు 10న స్వాతంత్య్రదినోత్సవ కానుకగా విడుదల చేయనున్నాడు. రాజకీయాలలో బిజీగా మారే ముందే తన సొంత చిత్రమైన 'శభాష్‌నాయుడు' , ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' చేయనున్నాడు.
ఇక ఈయన మొదటి సీజన్‌కే కాదు.. తమిళ బిగ్‌బాస్ షో రెండో సీజన్‌కి కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈయన ఇటీవలే తన 'విశ్వరూపం 2' ప్రమోషన్‌లో భాగంగా హిందీ వెర్షన్‌ను ప్రమోట్ చేయడం కోసం సల్మాన్‌ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్, దస్‌కా దమ్ షోలలో పాల్గొన్నాడు. ఇక కమల్‌హాసన్ చిత్రం అంటే అది తమిళంతో పాటు తెలుగులో కూడా భారీగా విడుదల అవుతుంది. తెలుగు వారిలో కూడా కమల్‌హాసన్‌ని మెచ్చే, నచ్చే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ కోసం ఆయన నాని హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్2 తెలుగు షోకి కూడా హాజరుకానున్నాడు.
ఈ సందర్భంగా బిగ్‌బాస్ సీజన్2 హౌస్‌లోని పార్టిసిపెంట్స్‌తో ఆయన కొద్దిసేపు గడపనున్నాడు. ఇక యూనివర్శల్ స్టార్‌గా, లోకనాయకుడిగా పేరున్న కమల్ బిగ్‌బాస్ హౌస్‌లో ఎలా సందడి చేయనున్నాడు? బిగ్‌బాస్‌ని తన 'విశ్వరూపం 2' ప్రమోషన్‌కి ఎలా వేదికగా వాడుకుంటాడో అనేది వేచిచూడాల్సిన విషయం. ఆయన రాక వల్ల ఆయా రోజులలో బిగ్‌బాస్ టీఆర్పీ రేటింగ్స్ భారీగా ఉండటం ఖాయమనే చెప్పాలి.