Advertisementt

రాశీఖన్నా లుక్స్ చూశారా..!!

Fri 03rd Aug 2018 11:36 AM
raashi khanna,big c mobile showroom,launch,srinivasa kalyanam  రాశీఖన్నా లుక్స్ చూశారా..!!
Raashi Khanna Launches Big C Mobile Showroom రాశీఖన్నా లుక్స్ చూశారా..!!
Advertisement
Ads by CJ

చిన్నా చితక హిట్స్ కొడుతూ జై లవ కుశలో ఎన్టీఆర్ కి జోడిగా నటించినా రాని ఫేమ్ తాను బాగా సన్నబడి ఒక యంగ్ హీరో పక్కన నటించిన రాశి ఖన్నా ఆ సినిమాతో మళ్ళీ లైమ్ టైం లోకొచ్చేసింది. తొలిప్రేమ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన క్యూట్ అండ్ లేటెస్ట్ లుక్స్ తో అదరగొట్టిన రాశి ఖన్నా కి వెనువెంటనే నితిన్ పక్కన శ్రీనివాస కళ్యాణం సినిమాకి ఛాన్స్ వచ్చేసింది. కాస్త లావుగా వున్నప్పుడు రాని అవకాశాలు కాస్త బరువు తగ్గగానే క్యూ కట్టాయి. అయితే రాశి అనుకునేంత అవకాశాలు ఆమెకి రావడం లేదు. ఇంకా యంగ్ హీరోలతోనే ఆమె సరిపెట్టుకోవాల్సి వస్తుంది. తొలిప్రేమ సినిమా తర్వాత రాశి ఖన్నాకి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సెస్ వస్తాయని ప్రచారం జరిగినా మళ్ళీ యంగ్ హీరో నితిన్ తోనే జోడి కట్టాల్సి వచ్చింది. అందులోను నితిన్ రెండు సినిమాల ప్లాప్స్ తో ఉన్నాడు. అయితే నిర్మాత దిల్ రాజు మీదున్న నమ్మకం, అలాగే సినిమాలోని తన పాత్రకి ఉన్న ఇంపార్టెన్స్ తోనే రాశి ఖన్నా ఈ శ్రీనివాస కళ్యాణం సినిమాని ఒప్పుకుంది. అయితే రాశి కి ఈ సినిమా వలన ఎలాంటి లాస్ జరగలేదనేది ట్రేడ్ లో ఉన్న శ్రీనివాస కళ్యాణం బజ్ చూస్తుంటేనే తెలుస్తుంది.

భారీ అంచనాలతో భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై జనాల్లో మంచి ఆసక్తి ఉంది. కారణం కుటుంబ కథా చిత్రం కావడం, దర్శకుడు సతీష్ వేగేశ్న గత చిత్రం శతమానం భవతితో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు. మరిన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాకి. ఇకపోతే ఈ సినిమాలో చాలా ట్రెడిషనల్ గా కనబడుతుందనిపిస్తుంది రాశి ఖన్నా. ఎందుకంటే శ్రీనివాసుడి గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఎలా వుండబోతుందో అనేది మొన్నామధ్యన జరిగిన శ్రీనివాస కళ్యాణం ఆడియో వేడుకలో చూస్తే అర్ధమయ్యింది. చక్కటి చీరకట్టులో నిజమైన పెళ్లి కూతురు మాదిరి రాశి లుక్స్ అదరగొట్టాయి. మరి సినిమాలో రాశి ఖన్నా లుక్స్ ఏమో కానీ... ఇప్పుడు మాత్రం బయట రాశి ఖన్నా లుక్స్ చూస్తుంటే మాత్రం అమ్మో శ్రీనివాసుడి గర్ల్ ఫ్రెండ్ మాములుగా లేదంటారు.

రాశి ఖన్నా తాజాగా ఒక బిగ్ సి మొబైల్ ఓపెనింగ్ కార్య్రక్రమానికి విచ్చేసింది. మరి ఆ ఓపెనింగ్ కోసం రాశి ఖన్నా వేసుకున్న డ్రెస్ ఆమెలోని అందాలను ఎక్స్  పోజ్ చేయకనే చేస్తున్నాయి. చాలా సన్నగా అందమైన చూపులతో.. తన హాట్ హాట్ అందాలతో.. రాశి ఖన్నా అందరిని మెస్మరైజ్ చేసింది. నిజంగా రాశి ఖన్నా హాట్ లుక్స్ చూస్తుంటే మాత్రం ఈసారి స్టార్ హీరోల చూపు ఆమెపై పడడం గ్యారెంటీ అనేలా ఉంది. మరి రాశి ఖన్నా అదృష్టం ఎలా ఉందో ఈ శ్రీనివాస కళ్యాణం సినిమా హిట్ మీదే ఆధారపడి ఉంది. ఇకపోతే శ్రీనివాస కళ్యాణం సినిమా మరో ఎనిమిది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Raashi Khanna Launches Big C Mobile Showroom:

Raashi Khanna HulChal at Big C Showroom Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ