Advertisementt

చిరు 'సై రా' సెట్ ఎందుకు కూల్చేశారు..!!

Thu 02nd Aug 2018 10:06 PM
sye raa,sye raa set demolitio,chiranjeevi,revenue officials,ram charan,rangasthalam  చిరు 'సై రా' సెట్ ఎందుకు కూల్చేశారు..!!
Why Revenue Officials Demolished Sye Raa Set? చిరు 'సై రా' సెట్ ఎందుకు కూల్చేశారు..!!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో తన తండ్రి చిరు హీరోగా ధృవ సినిమా ఫేమ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా సై రా నరసింహారెడ్డి అనే చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు సై రా చిత్ర బృందానికి హైదరాబాద్ రెవిన్యూ అధికారులు షాకిచ్చినట్లుగా తెలుస్తుంది. అది కూడా ఒక లాండ్ విషయంలో సై రా బృందానికి రెవిన్యూ అధికారులు చుక్కలు చూపించారనే విషయం హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం సై రా సినిమా షూటింగ్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన రంగస్థలం సినిమా కోసం వేసిన సెట్స్ లో జరుగుతుంది.

అక్కడ సై రా నరసింహారెడ్డి కోసం ఒక ఇంటి సెట్ ని నిర్మించారు. అయితే ఆ సెట్  శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి కావడంతో.. అనుమతులు లేకుండా సై రా సినిమా కోసం అక్కడ సెట్ వేసి ఇంటి నిర్మాణం ఎలా చేపడతారని... సై రా నరసింహారెడ్డి కోసం వేసిన ఇంటి సెట్ ని రెవిన్యూ అధికారులు కూల్చివేశారట. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో అలా సెట్ వేసేసి.. అక్కడి భూమిని అడ్డదారిలో కొందరు కొట్టేయాలని చూస్తున్నారని రెవిన్యూ అధికారులు ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. భూ కబ్జాల్లో ఇదో రకమైన కబ్జాగా వారు అభివర్ణిస్తుండడం చూస్తుంటే అక్కడెంత గొడవ జరిగిందో అర్ధమవుతుంది. 

ఈ విషయమై సై రా యూనిట్ కి చాలా సార్లు నోటీసులు పంపామని వారు చెబుతున్నారు. అయితే సై రా యూనిట్ మాత్రం ఈ భూమి కోర్టు గొడవల్లో ఉంది.. మేము వేరెవరి దగ్గరి నుండో లీజుకి తీసుకున్నామని చెబుతున్నారు. మరి ఈ గొడవ సినిమా క్రేజ్ కి ఏమన్నా దెబ్బ కొడుతుందా అనే అనుమానంతో మెగా ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. మరి పెద్ద పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు సహజమే అంటూ సైరా యూనిట్ కొట్టిపారేస్తుంది.

Why Revenue Officials Demolished Sye Raa Set?:

>Sye Raa Set Demolition: Exact Reason

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ