Advertisementt

టాలీవుడ్లో ఫెయిల్ .. కోలీవుడ్లో దున్నేస్తుంది!

Thu 02nd Aug 2018 08:38 AM
sayyeshaa saigal,akhil heroine,kollywood,karthy,sayyeshaa kollywood queen  టాలీవుడ్లో ఫెయిల్ .. కోలీవుడ్లో దున్నేస్తుంది!
Sayyeshaa Saigal busy in Kollywood టాలీవుడ్లో ఫెయిల్ .. కోలీవుడ్లో దున్నేస్తుంది!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్‌ నటించిన మొదటి చిత్రం 'అఖిల్‌'లో హీరోయిన్‌గా నటించడం ద్వారా సాయేషా సైగల్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఇక ఈమె మొదటి తెలుగు చిత్రమే డిజాస్టర్‌ కావడంతో మరో అవకాశం లభించలేదు. దాంతో ఆమె తన పూర్తి దృష్టిని కోలీవుడ్‌పైకి సారించింది. ఇప్పటికే ఆమె జయం రవి సరసన తన మొదటి తమిళ చిత్రంగా 'వనమగన్‌'తో కోలీవుడ్‌కి పరిచయం అయింది. ఆ తర్వాత కార్తికి జోడీగా 'కడైకుట్టి సింగం'లో యాక్ట్‌ చేసింది. ఈ సినిమా ఆమెకి మరింత గుర్తింపును తీసుకుని వచ్చింది. తాజాగా ఈమె విలక్షణ తమిళ యంగ్‌ స్టార్‌ విజయ్‌సేతుపతితో కూడా నటించి మెప్పించింది. త్వరలోనే ఆర్యతో కలిసి నటించిన 'గజనీకాంత్‌' విడుదల కానుంది. ఇక కెవి ఆనంద్‌ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న 37వ చిత్రంలో కూడా ఈమె అవకాశం వరించిందని అనుకుంటున్నారు. 

ఇలా అతి తక్కువకాలంలోనే ఆమె జయంరవి, కార్తి, విజయ్‌సేతుపతి, ఆర్యలతో పాటు కార్తి అన్నయ్య స్టార్‌ సూర్య సరసన నటించే అవకాశం సాధించడం అంటే ఆమె ఏ రేంజ్‌లో కోలీవుడ్‌లో దూసుకుపోతోందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఆమె మరో రెండు తమిళ చిత్రాలకు కూడా సైన్‌ చేసింది. తాజాగా ఆమె కార్తీతో నటించిన 'కడైకుట్టిసింగం' మంచి విజయం సాధించడంతో ఆమె మరింత దూకుడు పెంచింది. దీంతో ఈమెకి కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌ అనే పేరు వచ్చింది. దాంతో ఆమె తన మకాంను ముంబై నుంచి చెన్నైకి మార్చాలని నిర్ణయించుకుందట. అవకాశాలు ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. 

గతంలో ముంబై నుంచి వచ్చిన 'ఖుష్బూ, నమిత, సిమ్రాన్‌, జ్యోతిక, హన్సిక' వంటి వారు కోలీవుడ్‌లో ఓ వెలుగు వెలగడంతోనే వారి దారిలోనే ఈమె పయనిస్తోందని కోలీవుడ్‌ మీడియా అంటోంది. ఇక ఇటీవల విడుదలైన 'జుంగా' చిత్రం ఇచ్చిన విజయంతో ఈమె హవాకి హద్దులే లేకుండా పోతున్నాయి. ఈ ఏడాది కోలీవుడ్‌లో ఎక్కువ చిత్రాలలో నటించిన ఘనత ఈమెకే దక్కుతుందని కోలీవుడ్‌ సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Sayyeshaa Saigal busy in Kollywood:

Akhil Heroine Hulchal in Kollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ