హీరో నాగ చైతన్య - హీరోయిన్ సమంత లు ఐదేళ్లుగా ప్రేమించుకుని గత ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కూడా కనీసం హనీమూన్ కి కూడా వెళ్లకుండా ఇద్దరు తమ తమ సినిమా షూటింగ్స్ తో బిజీ అయ్యారు. సమంత అయితే కెరీర్ లో పెళ్లయ్యాక స్పీడు పెంచేసింది. పెళ్ళికి ముందు ఒప్పుకున్న మూడు సినిమాలు పెళ్లయ్యాక విడుదలయ్యాయి. మూడు సినిమాలు నెలకో సినిమా చొప్పున విడుదలయ్యాయి. మరి సమంత నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో రామ్ చరణ్ తో కలిసి నటించిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా.... మహానటి సూపర్ హిట్ అయ్యింది. మహానటిలో మధురవాణి అనే జర్నలిస్ట్ పాత్ర చేసిన సమంతకి మంచి పేరొచ్చింది.
ఇక ముచ్చటగా తెలుగు తమిళంలోనూ దున్నేసింది అభిమన్యుడు సినిమా. అభిమన్యుడు సినిమా కోలీవుడ్ లోను, టాలీవుడ్ లోను హిట్ అయ్యింది. మరి సమంత పెళ్ళికి ముందు సినిమాలు కొన్ని ప్లాప్ అయినా పెళ్లి తర్వాత మాత్రం అన్నిసినిమాలు హిట్ అయ్యాయి. ఇక పెళ్లి సమంతకి బాగా కలిసొచ్చిందన్నారు అంతా. ఇక నాగ చైతన్యకి, సమంతకి హిట్స్ దొరికినట్టుగా పెళ్లి తర్వాత హిట్స్ పడతాయో లేదో మరో నెల రోజుల్లోనే తేలిపోతుంది. యుద్ధం శరణం సినిమా ప్లాప్ తో పెళ్లి పీటలెక్కిన నాగ చైతన్యకి పెళ్లి తర్వాత ఒక్క మూవీ కూడా విడుదల కాలేదు. చందు మొండేటితో సవ్యసాచి సినిమా చేసిన నాగ చైతన్య .. మారుతీ దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేశాడు.
ఇక మంచి అంచనాలతో శైలజా రెడ్డి అల్లుడు ఆగష్టు 31 న అంటే ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి చందు మొండేటి సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా... కొన్ని కారణాలతో శైలజా రెడ్డి అల్లుడు సినిమా తర్వాత విడుదలకు సిద్దమవుతుంది. మరి శైలజా రెడ్డికి సవ్యసాచి విడుదలకు మధ్యలో ఒక నెల గ్యాప్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ రెండు సినిమాలతో నాగ చైతన్య ఏ సినిమాతో హిట్ కొడతాడా... సమంతకి పెళ్లి కలిసొచ్చినట్టుగా నాగ చైతన్యకి ఈ పెళ్లి ఎంత కలిసొస్తుందో అనేది మరో నెల రెండు నెలల్లో క్లారిటీ వచ్చేస్తుంది. మరి సామ్ - చై జంట శివ నిర్వాణం దర్శకత్వంలో కుటుంబ కథా చిత్రంలో భార్య భర్తలుగా నటించటానికి రెడీ అవుతున్నారు.