Advertisementt

విజయ్ నెక్స్ట్ ఫిల్మ్ టైటిల్ 'రోషగాడు'..!

Wed 01st Aug 2018 05:17 PM
vijay anthony,roshagadu,title fix,tamil hero vijay anthony  విజయ్ నెక్స్ట్ ఫిల్మ్ టైటిల్ 'రోషగాడు'..!
Vijay Next Film Title is Roshagadu విజయ్ నెక్స్ట్ ఫిల్మ్ టైటిల్ 'రోషగాడు'..!
Advertisement
Ads by CJ

వైవిధ్యమైన కధా చిత్రాలకు, రియలిస్టిక్ క్యారక్టరైజేషన్స్ కు కేరాఫ్ అడ్రస్ విజయ్ ఆంథోని. ప్యామిలీ ఓరియెంటెడ్ కంటెంట్ బేస్ట్ సినిమాలు చేస్తూ వస్తున్న ఈ హీరో ఇప్పుడు రోషగాడు గా ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ్ లో తిమిరపుడిచవాన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తెలుగులో రోషగాడు అన్న టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. 

ఆగస్ట్ 1 సాయంత్రం 5గం.లకు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి విజయ్ ఆంథోని చేసిన సినిమాలు కథా బలమున్న చిత్రాలుగా ప్రశంసలను పొందాయి. అలాంటిది తొలిసారి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా, అంతే కమర్షియల్ టైటిల్ తో వస్తొన్న రోషగాడుతో విజయ్ ఆంథోని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

నివేథా పేతురాజ్ (మెంటల్ మదిలో ఫేం) హీరోయిన్ గా, దీనా ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాష్య శ్రీ, సంగీతం: విజయ్ ఆంథోని, నిర్మాణం: విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోని. కథ-దర్శకత్వం: గణేష.

Vijay Next Film Title is Roshagadu:

Roshagadu is the Vijay Anthony's Next Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ