Advertisementt

దిల్ రాజు కావాలనే చేస్తున్నాడా.. లేక..?

Wed 01st Aug 2018 04:55 PM
dil raju,heroes,tongue slip,nithiin,raj tarun  దిల్ రాజు కావాలనే చేస్తున్నాడా.. లేక..?
Heroes Angry on Dil Raju's Tongue Slip Comments దిల్ రాజు కావాలనే చేస్తున్నాడా.. లేక..?
Advertisement
Ads by CJ

ప్లాప్స్ లో ఉంటే చెప్పినట్టు పడుండాలా..! అలానే ఉంది ఒక టాలీవుడ్ నిర్మాత వ్యవహారం. టాలీవుడ్ తోపుగా చెప్పుకునే దిల్ రాజు చిన్న హీరోలతో, మీడియం హీరోలతో, బడా హీరోలతో సినిమాలు చేసి హిట్స్ కొడుతుంటాడు. ఆయన నిర్మాణంలో పనిచేస్తే గ్యారెంటీ హిట్ అనుకునే హీరోలు చాలామందే టాలీవుడ్ లో ఉన్నారు. ఇక తనకు కలిసొచ్చిన హీరోనైతే రెండు మూడు సినిమాలకు ముందే లాక్ చేసేస్తాడు. ఇక డిస్ట్రిబ్యూటర్ గా కూడా చక్రం తిప్పే దిల్ రాజు తో సినిమాలు చేస్తే తమ సినిమాలకి ఢోకా ఉండదని హీరోలు చెబుతుంటారు. అయితే అలా హీరోలు చెప్పడం వలన దిల్ రాజుకి ఓవర్ కాన్ఫిడెన్స్ బాగానే ఎక్కువైనట్లుగా కనబడుతుంది. అందుకే ప్లాప్స్ లో ఉండి తనదగ్గరకొచ్చే హీరోల గురించి పబ్లిక్ గా ఏదేదో మాట్లాడేస్తున్నాడు.

ఈ మధ్యన దిల్ రాజు మాట్లాడే మాటలు చూస్తుంటే కొంతమంది హీరోలను తనకి తెలిసి అవమానిస్తున్నాడో.. తెలియకుండా అవమానిస్తున్నాడో అనే విషయం అర్ధమై చావడం లేదు. మొన్నటికి మొన్న లవర్ సినిమా విషయంలోనూ అంతే. అసలే కష్టాల్లో ఉన్న రాజ్ తరుణ్ ఏమో దిల్ రాజు నిర్మాతగా సినిమా చేస్తే హిట్ అవుతుందని.. లక్కు మళ్ళీ కలిసొస్తుందని అనుకుంటే.. లవర్ ని తన బ్యానర్ లోనే నిర్మించినా, పెద్దగా పట్టించుకోకపోగా.. రాజ్ తరుణ్ ప్లాప్స్ లో ఉన్నాడు కాబట్టే లవర్ సినిమా చేశానని చెప్పిన దిల్ రాజు తాజాగా మరో హీరోపై నోరు పారేసుకున్నాడు.

నితిన్ హీరోగా శ్రీనివాస కళ్యాణం సినిమాని ఇంట్రెస్ట్ తో శ్రద్దగా నిర్మించిన దిల్ రాజు.. నితిన్ మీద కూడా సెటైర్ వేసేశాడు. శ్రీనివాస కళ్యాణంకి ముందు రెండు సినిమాల ప్లాప్స్ తో ఉన్న నితిన్.. దిల్ రాజు దగ్గరకెళ్ళి తనకో సినిమా చేసి పెట్టమన్నాడట. ఇక సతీష్ వేగేశ్న కథతో నితిన్ తో సినిమా చేసిన దిల్ రాజు గమ్మునుంటే ఓకే.. కానీ నితిన్ ని ప్లాప్స్ నుండి బయటెయ్యడానికే శ్రీనివాస కళ్యాణం సినిమాని నిర్మించినట్లుగా... నితిన్ తనని సినిమా చెయ్యమని అడిగినట్లుగా... గొప్పగా చెబుతున్నాడు. మరి సినిమా విడుదలకు ముందే హీరోల మీద జాలితో సినిమాలు చేస్తున్నట్లుగా దిల్ రాజు చెప్పడం ఎంతవరకు కరెక్ట్. అయినా ఇలా చేస్తే దిల్ రాజుకి ఏ స్టార్ హీరో అయినా సినిమాని నిర్మించే అవకాశం కలిపిస్తారా అంటూ సెటైర్స్ వేస్తున్నారు జనాలు. మరి దిల్ రాజు కావాలని మాట్లాడుతున్నాడో ... లేదంటే అజ్ఞానంతో మాట్లాడుతున్నాడో గాని ఏదైనా ఈ వ్యవహారం మాత్రం దిల్ రాజు పీకకి చుట్టుకునేలా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది.

Heroes Angry on Dil Raju's Tongue Slip Comments:

Dil Raju Cheep Comments  on Flop Heroes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ