శ్రీరెడ్డి.. అన్నంత పని చేసింది..!
సినిమాలలో వేషాలు ఇచ్చే నెపంతో లైంగికంగా వేధింపులు, వాడుకుని కూడా అవకాశాలు ఇవ్వకపోవడం వంటి వాటిపై గత కొంతకాలంగా శ్రీరెడ్డి తన గళం విప్పుతోంది. ఇదే క్రమంలో ఆమె నాని, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్‌కమ్ముల, డి.రామానాయుడు మనవడు అభిరామ్ తదితరులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ తర్వాత వెంటనే ఈమె కోలీవుడ్‌పై విరుచుకుపడింది. రాఘవలారెన్స్, మురుగదాస్‌లతో పాటు విశాల్‌పై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది.
దాంతో కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత వారాహి ఓ ప్రెస్‌మీట్‌లో శ్రీరెడ్డి ఓ వేశ్య అని పౌరుషంగా విమర్శించాడు. దీనిపై తాను చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని శ్రీరెడ్డి చెప్పింది. చివరకు ఆమె అనుకున్నంత పని చేసింది. తాజాగా ఆమె చెన్నై పోలీస్ కమీషనర్‌ని కలిసి వారాహిపై కేసు పెట్టింది. సినిమాలలో వేషం ఇస్తామని లైంగికంగా వాడుకుంటున్నారని, దానిపై నేను ప్రశ్నిస్తూ ఉండటం.. అమ్మాయిలను వాడుకుంటున్న వారి పేర్లు బయటపెడుతూ ఉండటంతో వారాహి తనను వ్యభిచారిగా చిత్రీకరించాడని తన ఫిర్యాదులో పేర్కొంది.
ఇదే విషయమై నడిగర్ సంఘం పెద్దలైన నాజర్, విశాల్, కార్తిలకు ఫిర్యాదు చేయాలని చూస్తే, వాళ్లు పట్టించుకోలేదని వెల్లడించింది. గతనెల 24వ తేదీన వారాహి మీడియా ముందుకు వచ్చి శ్రీరెడ్డిని వ్యభిచారి అని వ్యాఖ్యానించాడు. ఇక శ్రీరెడ్డి ఈ విషయంలో చెన్నై పోలీసులను, ఏకంగా పోలీస్‌కమిషనర్‌కి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ముదిరి పాకానపడుతోందనే చెప్పాలి. మరి భవిష్యత్తులో ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుంది..? దీనిపై విశాల్ ఏమని స్పందిస్తాడో వేచిచూడాల్సివుంది...?