Advertisementt

బిగ్‌బాస్‌లోకి మరో ముఖ్య అతిధి...!

Sun 29th Jul 2018 09:26 PM
siva balaji,bigg boss 1 winner,entry,bigg boss 2  బిగ్‌బాస్‌లోకి మరో ముఖ్య అతిధి...!
Bigg Boss 1 Winner Shiva Balaji into Bigg Boss 2 house బిగ్‌బాస్‌లోకి మరో ముఖ్య అతిధి...!
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్‌ సీజన్‌1లో విజేతగా నిలిచిన నటుడు శివబాలాజీ. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేసి, తన ప్రవర్తనతో పార్టిసిపెంట్స్‌ని, బిగ్‌బాస్‌ ఎన్టీఆర్‌ని, ప్రేక్షకులను కూడా ఆయన మెప్పించాడు. దాంతో తొలి సీజన్‌ విజేతగా నిలిచాడు. ప్రేక్షకుల ఓట్లు కూడా ఆయనకు బాగా పడ్డాయి. ఇక విషయానికి వస్తే బిగ్‌బాస్‌ సీజన్‌1కి హోస్ట్‌గా చేసిన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ వల్ల ఈ షోకి మంచి రేటింగ్స్‌ వచ్చాయి. సీజన్‌2 ప్రారంభంలో బిగ్‌బాస్‌గా నాని కాస్త తడబడినా రోజులుగడిచే కొద్ది ఆయన కూడా బాగానే ఆకట్టుకుంటున్నాడు. 

మరోవైపు బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఈ సీజన్‌ని మరింతగా సక్సెస్‌ చేయడానికి అన్ని విధాలుగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవల ఈ హౌస్‌లోకి యాంకర్‌ ప్రదీప్‌ అతిధిగా వెళ్లాడు. తాను పార్టిసిపెంట్స్‌ కుటుంబ సభ్యులను కలిసి వచ్చానని చెప్పి అందరికీ ఆనందాన్ని కలిగించాడు. ప్రదీప్‌ గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్‌కి మంచి టీఆర్పీ రేటింగ్స్‌ వచ్చాయి. దాంతో ఈ షో నిర్వాహకులు త్వరలో హౌస్‌లోకి మరో గెస్ట్‌ని పంపాలని భావిస్తున్నారట. ఆయన ఎవరో కాదు బిగ్‌బాస్‌ సీజన్‌1 విజేత శివబాలాజీ. 

గత సీజన్‌ విన్నర్‌గా ఈయన హౌస్‌లోని గెస్ట్‌గా వెళితే ప్రేక్షకుల స్పందన బాగా ఉంటుందని, అందులో ఈ షోలో పాల్గొన్న అనుభవం ఉండటం, విజేతగా నిలవడం వల్ల శివబాలాజీ సీజన్‌2లోకి గెస్ట్‌గా వెళ్లితే అది పార్టిసిపెంట్స్‌కి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. మరి శివబాలజీ ఎప్పుడు బిగ్‌బాస్‌కి ముఖ్య అతిధిగా వస్తాడో వేచిచూడాల్సివుంది...! 

Bigg Boss 1 Winner Shiva Balaji into Bigg Boss 2 house:

Siva Balaji Entry Into Bigg Boss 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ