బాలీవుడ్ సీనియర్ నటి, పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి ఈ వయసులో కూడా అటు ఐపిఎల్ ఓనర్‌గా, సినీ నటిగా తన గ్లామర్‌ని ఎంతగానో కాపాడుకుంటూ నవతరం హీరోయిన్లతో పోటీ పడుతూ, వారికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇక ఈమె ఏ వేడుకకు వచ్చినా అక్కడ అందరి చూపు, మీడియా దృష్టి, కెమెరాలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతుంటాయి. ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన 'సాహసవీరుడు-సాగరకన్య', ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో మోహన్‌బాబు హీరోగా నటించిన 'వీడెవడండీ బాబూ', అరుణ్‌ప్రసాద్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన 'భలే వాడివి బాసూ' వంటి చిత్రాలలో నటించింది.
ఇక ఈమె ఏ వేడుకకు వెళ్లినా అందరికంటే తన కాస్ట్యూమ్స్ నుంచి ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. దీంతో అందరు ఈమెని బాలీవుడ్ స్టైలిస్ ఐకాన్‌గా పేర్కొంటారు. ఇందులో ఆమె అభిరుచి ఎంతో గొప్పగా ఉంటుంది. కొత్త కొత్త డిజైన్స్ కాస్ట్యూమ్స్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఈ విషయంలో ఎంతో విభిన్నంగా ఆలోచిస్తుంది. ఇలా అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ ఉంటుంది. సాధారణంగా కాకుండా సరికొత్తగా మేకప్ వేయాలని తన మేకప్‌మెన్‌ని, కాస్ట్యూమ్స్ డిజైనర్‌ని ప్రత్యేకంగా కోరుతూ ఉంటానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన వెంట తన సొంత మేకర్ సామగ్రిని తీసుకుని వెళ్తుంటుంది. తాజాగా ఆమె మెటాలిక్ చీరలో ర్యాంప్‌పై హోయలు పోయింది. ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన ఈ చీర అందరి దృష్టిని ఆకర్షించింది. ఊదా రంగులో ఉన్న ఈ చీర తళుక్కుతళుక్కున మెరుస్తూ మిలమిలా ఓ వెలుగు వెలిగింది. దీంతో సాగరకన్య అందం రెట్టింపు అయింది. క్రిస్టల్స్‌ని ఈ చీరలో పొదగడం విశేషం.