బిగ్‌బాస్ సీజన్2 రోజురోజుకి ఆసక్తికంగా మారుతోంది. ఇక ఈ హౌస్‌లోని పార్టిసిపెంట్స్‌పై మరీ ముఖ్యంగా హేతువాది బాబు గోగినేనిపై బిగ్‌బాస్ నాని మండిపడ్డాడు. హౌస్‌లో జరుగుతున్న పరిణామాలు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ వివాదం, సభ్యులు గ్రూపులు కట్టడం, బాబుగోగినేని అనుచిత వ్యాఖ్యలపై నాని తీవ్రంగా స్పందించాడు. బాబు-గీతామాధురి వివాదం, దీప్తిని ఓడించాలని ప్రయత్నిస్తూ గ్రూప్ రాజకీయలకు తెరదీసిన బాబుగోగినేని వ్యవహారశైలిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇదే విషయాన్నినాని స్పష్టం చేశాడు.
బాబుని నామినేట్ చేసిన విషయంలో కారణాలు సరిగా లేవని నాని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో నాని.. కౌశల్ తీరుని తప్పుబట్టారు. నాస్తికులైతే గుడికి వెళ్లకూడదా? మరి రాజమౌళి నాస్తికుడైనంత మాత్రాన గుడికి వెళ్లకూడదని బాబుగోగినేని వ్యాఖ్యానించడం సరికాదు.. నేను కూడా మా అమ్మమ్మని సంతోషపెట్టడానికి గుడికి వెళ్తుంటానని నాని తెలిపారు. కౌశల్‌ని, గీతాని హౌస్ నుంచి బయటికి పంపించడమే తన లక్ష్యమని, ఒకవేళ నేను బయటికి వెళ్లిపోయినా మీరందరు కలిసి ఆ పని చేయాలని బాబు పార్టిసిపెంట్స్‌కి చెప్పడం కూడా వివాదానికి కారణమైంది.
దీనికి నాని ఎవరు ఎవరిని పంపించలేరని ఘాటుగా స్పందించాడు. నాయకత్వ లక్షణాలు నేర్పించడం కోసమే తాను ప్రయత్నాలు చేస్తున్నానని బాబు చెప్పడంతో.. నాయకులను చేసేది ప్రజలు మాత్రమేనని నాని అభిప్రాయపడ్డాడు. దీంతో బాబుగోగినేని మాట్లాడుతూ, నాకు బిగ్‌బాస్‌లో ఉండాలనే ఉంది. కానీ బయటకు పంపిస్తామంటే దానికి కూడా సిద్దంగా ఉన్నాను. నేనెవ్వరికీ భయపడను. కౌశల్ కావాలని గేమ్స్ ప్లే చేస్తున్నాడని బాబు కూడా చెప్పుకొచ్చాడు.