తెలుగులో పరభాషా విలన్లకు ఎప్పుడు కొదువలేదు. కానీ ఈ రంగంలో కూడా కొత్త కొత్త హీరోయిన్లను పరిచయం చేసినట్లే హీరోలకు పోటీగా నిలిచే విలన్లను పరిచయం చేసేందుకు కూడా దర్శక నిర్మాతలు, హీరోలు పోటీ పడుతుంటారు. తమకి సరితూగే విలన్లు కావాలని కోరుకుంటారు. కానీ కోట, రఘువరన్, వంటి కూల్ విలనిజం నేటి తరానికి నచ్చడం లేదు. విలన్ అంటే ఆజానుబాహుడై, కండలు తిరిగి.. భయంకరంగా ఉండాలనేది సినీ పరిశ్రమలో నాటుకుపోయింది.
ఇక విషయానికి వస్తే ఒకనాడు విలన్లుగా అదరగొట్టిన ముఖేష్‌రుషి, ప్రదీప్‌రావత్ వంటి వారు పోను పోను కొత్త పోటీని తట్టుకోలేక అవకాశాలు సాదించలేకపోతున్నాడు. ఇక విలన్‌గానే గాక 'ఒక్కడు'తో పాటు తాజాగా 'శ్రీమంతుడు, అత్తారింటికిదారేది, రామయ్యా వస్తావయ్యా, పవర్' వంటి ఎన్నో చిత్రాలలో తండ్రి పాత్రలు, విలన్ పాత్రలు చేసిన ముఖేష్‌రుషికి ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండటం లేదు. దాంతో ఆయన బుల్లితెరపైకి దృష్టి మరలించాడు. హిందీలో 'పృథ్వీవల్లబ్' అనే సీరియల్ ద్వారా తెరంగేట్రం ఇస్తున్నాడు.
ఇక విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆయన తెలుగుతోపాటు హిందీ, పంజాబీ, భోజ్‌పురి చిత్రాలలో కూడా నటించాడు. ఇటీవల తెలుగులో అల్లుఅర్జున్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సూపర్‌హిట్ చిత్రం 'రేసుగుర్రం'లో విలన్‌గా నటించాడు. అందులో కడప పెద్దిరెడ్డి పాత్రను పోషించి మెప్పించిన ఈయన బుల్లితెరపై తన ఆకారం, ఆహార్యంతో ఎంత వరకు మెప్పిస్తాడో వేచిచూడాల్సివుంది..!