Advertisementt

శృతిహాసన్ ధ్యాసంతా ఇప్పుడు దానిమీదే..!

Sun 29th Jul 2018 02:06 PM
shruti haasan,love,compose music  శృతిహాసన్ ధ్యాసంతా ఇప్పుడు దానిమీదే..!
Shruti Haasan Interest Revealed శృతిహాసన్ ధ్యాసంతా ఇప్పుడు దానిమీదే..!
Advertisement
Ads by CJ

శృతిహాసన్‌ హీరోయిన్‌ కాకముందు నుంచే ఆమెకి లండన్‌లో ఓ మ్యూజిక్‌ ట్రూప్‌ ఉండేది. ఆమె ప్రియుడు మైఖేల్‌ కూడా అందులోని వాడే. ఈమె సినిమాలలోకి రాకముందే విదేశాలలో ప్రోగ్రామ్స్‌, మ్యూజికల్‌ ఆల్బమ్స్‌కి పనిచేసింది. కమల్‌హాసన్‌, మోహన్‌లాల్‌ కలిసి నటించిన 'ఈనాడు' చిత్రం తమిళవెర్షన్‌ ద్వారా తాత్కాలిక సంగీత దర్శకురాలిగా, గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా హీరోయిన్‌ అవకాశాలు వస్తూ ఉండటంతో ఆమె గ్లామర్‌షోతో కూడా తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకుంది. 

ప్రస్తుతం ఈమె తన తండ్రి దర్శకత్వం వహిస్తూ, నటిస్తూ, నిర్మిస్తున్న 'శభాష్‌నాయుడు' చిత్రంతో పాటు బాలీవుడ్‌ ప్రముఖుడు మహేష్‌ మంజ్రేకర్‌ చిత్రంలో కూడా నటిస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈమె సూపర్‌హిట్‌ సాంగ్స్‌ని పాడి ఆహుతులను అలరించింది. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను మరలా సంగీతం వైపు చూపు సారించాను. ఎక్కువ పాటలు పాడటమే కాదు. పాటల రచన కూడా చేస్తున్నాను... అని చెబుతూ తాను రాసిన ఓ కవితను వినిపించింది. నా కవితలను ఎవరికి చూపించలేదు. వినిపించలేదు. ఇప్పటికి ఎన్నో కవితలు రాశానని చెప్పింది. ఆమె నటిగా పెద్దగా ఒప్పుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణం.

Shruti Haasan Interest Revealed:

Shruti haasan Loved to Compose Music

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ