ఛలో లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత నాగశౌర్య, ఐరా క్రియోషన్స్ కాంబినేషన్ లో ప్రొడక్షన్ నెం-2 గా తెరకెక్కుతున్న చిత్రం @నర్తనశాల మొదటి లుక్ ని ఇటీవలే విడుదల చేశారు. ఈ లుక్ కి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ రావటం విశేషం. ఈ చిత్రంలో కష్మిర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఇటలీలో సాంగ్స్ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి, శివాజి రాజా, జెమిని సురేష్, రాఘవ, రాకెట్ రాఘవ మంచి పాత్రల్లో కనిపిస్తారు. శ్రీనివాస చక్రవర్తి దర్శకుడు. చిత్ర సమర్పకుడు శంకర ప్రసాద్ మూల్పూరి, చిత్ర నిర్మాత ఉష మూల్పూరి. ఛలో లాంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ కి సంగీతాన్ని అందించిన మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి చాలా మంచి సంగీతాన్ని అందించారు. ప్రముఖ రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు. జూలై 31న 4.30 నిమిషాలకి మొదటి సింగిల్ ని విజువల్ గా విడుదల చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని అగష్టు 31న విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ.. ఛలో చిత్రాన్ని మ్యూజికల్ గా ఎంత ఘన విజయం చేశారో అందరికి తెలుసు. ఇప్పడు మా @నర్తనశాలని కూడా అంతకు మించి విజయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో మొదటి సింగిల్ ని జూలై 31న 4.30 నిమిషాలకి విడుదల చేయటానికి నిర్ణయించాం. అలాగే ఈ చిత్ర ఆడియో మహతి స్వర సాగర్ అద్బుతంగా చేశాడు. ఛలో కంటే మంచి విజయాన్ని అందుకుంటామన్న నమ్మకం వుంది. భాస్కరభట్ల మంచి సాహిత్యం అందించారు. మా దృష్టిలో సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అందుకే మా ఐరా క్రియెషన్స్ నుండి వచ్చిన ఛలో కూడా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ తో చేశాము. ఇప్పుడు మా @నర్తనశాల కూడా పూర్తి వినోదాత్మకంగా తీర్చిదిద్దాము. ఈ చిత్రం వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని , అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. మా హీరో నాగశౌర్య చాలా అందంగా కనపడతాడు. చాలా మంచి పాత్ర చేస్తున్నాడు. అలాగే హీరోయిన్స్ కష్మిర పరదేశి, యామిని భాస్కర్ లు చాలా బాగా నటించారు. ఈ చిత్రంలో ఎవరి పాత్రకి వారు కరెక్ట్ గా సరిపోయారు. ఎగిరినే మనసు అని సాగే సాంగ్ విజువల్ ని విడుదల చేస్తున్నాము. ఈ సాంగ్ అందర్ని విపరీతంగా ఆకట్టుకుంటుందని మా నమ్మకం. ఈ చిత్రాన్ని అగష్టు 31న విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.