Advertisementt

మెగాడాటర్‌ కోరిక తీరుతోంది..!

Sat 28th Jul 2018 02:13 PM
niharika,megastar chiranjeevi,sye raa movie  మెగాడాటర్‌ కోరిక తీరుతోంది..!
Niharika in Sye Raa Movie మెగాడాటర్‌ కోరిక తీరుతోంది..!
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒకే ఒక్క లేడీ ఆర్టిస్టుగా మెగాబ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారికను చెప్పవచ్చు. తాజాగా ఆమె సుమంత్‌ అశ్విన్‌ సరసన 'హ్యాపీ వెడ్డింగ్‌'లో నటించింది. ఇక ఈమె ఎన్నో ఇంటర్వ్యూలలో పెదనాన్న చిరంజీవి, బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌, అన్నయ్య రామ్‌చరణ్‌తోపాటు మెగా ఫ్యామిలీ హీరోల చిత్రాలలో అవకాశం వస్తే వదులుకోనని చెబుతూ వస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి చిత్రంలో ఒక్క క్షణం అయినా కనిపించే అవకాశం రావాలని దేవుడికి కోరుకుంటున్నట్లు తన మనసులోని మాటను వెల్లడించింది. 

ఇక చిరంజీవి దాదాపు దశాబ్దం తర్వాత సినిమాలలోకి రీఎంట్రీ ఇస్తూ తన ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రంగా నటించిన 'ఖైదీనెంబర్‌ 150'లో ఒక్క సెకన్‌ అయినా కనిపించే చాన్స్‌ రావాలని మెగా హీరోలతో పాటు ఇతర నటీనటులు, నిహారిక కూడా ఆరాట పడింది. కానీ ఆ సినిమా విషయంలో ఆమెకి ఆ అవకాశం రాలేదు. కానీ ఇంత కాలానికి ఆమె చిరకాల కోరిక నెరవేరనుందని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి తన మెగాడ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు, రాయలసీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా 'సై..రా..నరసింహారెడ్డి' చిత్రం చేస్తున్నాడు. ఇందులో అమితాబ్‌బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌సేతుపతి, బాలీవుడ్‌తో పాటు అన్ని భాషలకు చెందిన భారీ తారాగణం ఇందులో నటిస్తోంది. ఇక హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా మరో కీలకపాత్రను తమన్నా చేస్తోంది. 

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మాతగా తమ హోం బేనర్‌ అయిన 'కొణిదెల' ప్రొడక్షన్స్‌లో భారీ బడ్జెట్‌తో 'బాహుబలి'కి పోటీగా అన్నట్లు ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇందులో మెగా డాటర్‌ నిహారిక ఓ పాత్రను చేస్తోందిట. గిరిజన యువతిగా ఆమె మూడు నాలుగు సీన్స్‌ ఉండే పాత్రలో చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి మిగిలిన అందరికంటే ఎంతో త్వరగా తన పెదనాన్న నటించే చిత్రంలో ఆమెకి అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. 

Niharika in Sye Raa Movie:

Niharika Dream Fulfill with Megastar Sye Raa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ